Homeలైఫ్ స్టైల్Bejeweled Trend: బిజువెల్డ్ ట్రెండ్.. ఫ్యాషన్‌లో కొత్త ట్రెండ్‌!

Bejeweled Trend: బిజువెల్డ్ ట్రెండ్.. ఫ్యాషన్‌లో కొత్త ట్రెండ్‌!

Bejeweled Trend: కొందరు సింపుల్ గా మినిమలిస్ట్ గా ఉండాలనుకుంటే మరికొందరు భారీగా జిగేల్ అనాలని కోరుకుంటారు. ఇలా నలుగురిలో గాడీగా కనిపించాలనుకునే మాగ్జిమలిస్టులంతా ఇప్పుడు బిజువెల్డ్ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. వస్త్రాలు, యాక్సెసరీస్ అన్నీ పెద్ద ఎత్తున ధరించి, అందరి చూపు తమవైపు తిప్పుకోవటమే ఈ ట్రెండ్. వెస్ట్రన్ వేర్ మొదలు ట్రెడిషనల్ వేర్ వరకు వస్త్రాలు ఏవైనా బిజువెల్డ్ మంత్రాను అప్లై చేయచ్చు. ఆమధ్య అంబానీ కుమార్తె ఈషా ట్రై చేసిన లుక్ చాలామందిపై ప్రభావం చూపింది.

- Advertisement -

కాక్ టైల్ వార్డ్ రోబ్ సెక్విన్స్, షిమ్మర్స్, క్రిస్టల్స్, మెటాలిక్ థ్రెడ్స్ వంటి భారీతనం ఉట్టిపడేవాటితో డిజైన్ చేసిన వస్త్రాలు వేసుకుంటే చాలా స్పెషల్ గా కనిపించేస్తారు కాబట్టి ఈ ట్రెండ్ పెద్ద హిట్ అయింది. చీరలు, బ్లౌజులు, గౌనులు, స్కర్ట్స్, జాకెట్స్ ..ఇలా వేటినైనా భారీతనం ఉట్టిపడేలా డిజైన్ చేయించుకుంటే ఫ్యాషన్ మూడ్ బోర్డ్ సరికొత్తగా కనిపించేస్తుంది. వీటినే ఫెస్టివ్, కాక్ టైల్, రెడ్ కార్పెట్ వార్డ్ రోబ్స్ అంటున్నారు. సోనం కపూర్, రాధికా మర్చంట్, అనన్యా పాండే, దిషా పటాని వంటి సెలబ్స్ బిజువెల్డ్ లుక్ లో మెరిసిపోయారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News