Saturday, November 15, 2025
Homeలైఫ్ స్టైల్Motion Sickness: జర్నీలో వాంతులు వస్తాయా?.. ఈ హోమ్ రెమెడీస్‌ పాటించాల్సిందే!

Motion Sickness: జర్నీలో వాంతులు వస్తాయా?.. ఈ హోమ్ రెమెడీస్‌ పాటించాల్సిందే!

Motion Sickness Home remedies: కొంతమందికి బస్సు, కార్, ట్రైన్ లేదా ఫ్లైట్‌లో ప్రయాణం చేస్తే తల తిరగడం, వికారం, వాంతులు వచ్చే సమస్యలు ఉంటాయి. దీనిని మోషన్ సిక్నెస్ అంటారు. ఇది చిన్న పిల్లలు, వృద్ధులు మరియు మహిళల్లో ఎక్కువగా కనిపించే సాధారణ సమస్య. దీని వల్ల చాలామంది ప్రయాణాలనే మానేస్తారు. కానీ ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, ఈ సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే, మీరు కూడా సంతోషంగా, అనుభూతికలిగిన ప్రయాణాన్ని పూర్తిచేయవచ్చు.

- Advertisement -

మొదటిగా, ప్రయాణానికి ముందు రోజు రాత్రి భారం ఆహారం తినకూడదు. డీప్ ఫ్రై చేసిన, మసాలాలు ఎక్కువగా ఉన్న, కారంగా ఉండే పదార్థాలను తినడం వల్ల కడుపు బరువుగా మారుతుంది. దీంతో గ్యాస్ ఏర్పడి వికారం కలగొచ్చు. అందువల్ల తేలికపాటి, త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిది. ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం ప్రయాణ సమయంలో మీకు సౌకర్యంగా అనిపిస్తుంది.

అలాగే ప్రయాణానికి ముందు రోజు తగినంత నిద్ర తీసుకోవడం కూడా చాలా అవసరం. శరీరం అలసిపోయి ఉండటం వల్ల మైగ్రెయిన్, వికారం, వాంతులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే రాత్రి నిద్ర తప్పనిసరిగా తీసుకోండి. అలాగే మునుపటి అనుభవాల ప్రకారం మోషన్ సిక్నెస్‌కి అవసరమైన మందులను ముందుగా సిద్ధంగా ఉంచుకోవాలి. డాక్టర్ సూచించిన విధంగా ప్రయాణానికి సుమారు అరగంట ముందు మందు తీసుకుంటే ఫలితం బాగుంటుంది.

ఇంకా, సహజ నివారణలుగా అల్లం లేదా నిమ్మకాయ నీరు మంచి ఉపశమనం ఇస్తాయి. అల్లం టీ లేదా గోరువెచ్చని నిమ్మకాయ నీరు కడుపును ప్రశాంతంగా ఉంచుతుంది. ఇవి వికారం దరిచేరకుండా చేయగలవు. ప్రయాణంలో ఏ అసౌకర్యం వచ్చినా తేలికగా పరిష్కరించుకునేలా ఒక చిన్న ట్రావెల్ కిట్‌ని సిద్ధం చేసుకోవడం మంచిది. ఇందులో వాంతుల కోసం చిన్న ప్లాస్టిక్ బ్యాగ్, టిష్యూలు, పుదీనా క్యాప్సూల్స్ లేదా మింట్ టాబ్లెట్లు, మౌత్ ఫ్రెషనర్, తాగేందుకు నీరు ఉండేలా చూసుకోవాలి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే, మోషన్ సిక్నెస్ మీ ఆనందాన్ని దెబ్బతీయకుండా ఉంటుంది. అలాగే ప్రయాణాన్ని మీరు ఆస్వాదించవచ్చు. దీంతో పాటు మీ ఆరోగ్యాన్ని కూడా సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఈ ప్రణాళికలు పాటించకపోవడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన చాలా మంది సమస్యలను ఎదుర్కుంటూ ఉంటారు. ఆ తరువాత తమ చేదు అనుభవాలను తలచుకుంటూ బాధ పడుతుంటారు. అందుకే ఈ ముందస్తు ప్రణాళికతో మీరు ప్రయాణాన్ని సురక్షితంగా, సంతోషంగా పూర్తి చేయవచ్చు. తప్పనిసరిగా మీకు ప్రయాణంలో ఇబ్బందులు తలెత్తితే.. జాగ్రత్తలు పాటించడం మానకండి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad