Tuesday, March 18, 2025
Homeలైఫ్ స్టైల్Onions: ఇలాంటి ఉల్లిపాయలు తింటున్నారా..? అయితే మీ ఆరోగ్యం షెడ్డుకే..!

Onions: ఇలాంటి ఉల్లిపాయలు తింటున్నారా..? అయితే మీ ఆరోగ్యం షెడ్డుకే..!

ఉల్లిగడ్డలు మన వంటల్లో రోజూ వాడే ముఖ్యమైన పదార్థం. ఉల్లిగడ్డ లేకపోతే చాలా వంటకాలకు రుచి రాదు. ఇవి తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది. వీటిలో పొటాషియం, సోడియం, విటమిన్ C, B6, విటమిన్ D, కాల్షియం, మెగ్నీషియం, ఇనుము వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉల్లిపాయలను పచ్చిగా తినొచ్చు, వంటల్లో కూడా వాడుకోవచ్చు. ఇలా ఏ విధంగా తీసుకున్నా శరీరానికి చాలా మేలు జరుగుతుంది. కానీ కొన్నిసార్లు ఉల్లిగడ్డలు కోసేటప్పుడు లోపల నల్లగా మచ్చలు కనిపిస్తాయి. కొంతమంది ఆ నల్లటి భాగాన్ని తీసేసి ఉల్లిగడ్డను వాడతారు, మరికొంతమంది శుభ్రంగా కడిగి వాడతారు. ఇంతకీ ఈ నల్లటి మచ్చలు ఎందుకు వస్తాయో, వాటివల్ల ఏమైనా నష్టం ఉందో చాలామందికి తెలియదు. ఈ కథనంలో దీని గురించి తెలుసుకుందాం.

- Advertisement -

ఉల్లిపాయలపై కనిపించే ఈ నల్లటి మచ్చలు ఆస్పర్గిల్లస్ నైజర్ అనే ఒక రకమైన ఫంగస్ వల్ల వస్తాయి. ఇది సాధారణంగా మట్టిలో పెరిగే ఫంగస్. కొన్నిసార్లు ఇది గాలిలో కూడా కలిసి ఉండి మనం శ్వాస ద్వారా పీల్చుకునే అవకాశం ఉంది. ఈ బ్లాక్ ఫంగస్ ఉన్న ఉల్లిగడ్డలు తింటే కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా అలెర్జీలు ఉన్నవారికి ఇది చాలా ప్రమాదకరం. ఆస్తమా ఉన్నవారు తింటే శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. తలనొప్పి, వికారం, వాంతులు, కడుపు నొప్పి, విరేచనాలు వంటి సమస్యలు కూడా రావొచ్చు. ఎక్కువ రోజులు ఇలాంటి ఉల్లిగడ్డలు తింటూ ఉంటే శరీరంలో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. ఫ్రిజ్‌లో ఉల్లిగడ్డలను పెడితే ఈ ఫంగస్ ఇతర ఆహార పదార్థాలకు కూడా వ్యాపించవచ్చు.

ఉల్లిగడ్డ పైపైన మాత్రమే బ్లాక్ ఫంగస్ ఉంటే ఆ భాగాన్ని తీసేసి వాడుకోవచ్చు. కానీ లోపలి భాగం కూడా నల్లగా మారితే అలాంటి ఉల్లిగడ్డలను వాడకపోవడమే మంచిది. ఉల్లిగడ్డలు కొనేటప్పుడు బ్లాక్ ఫంగస్ ఉందేమో చూసుకుని కొనాలి. ఉల్లిగడ్డలను చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. ఫ్రిజ్‌లో పెడితే ఫంగస్ ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఎక్కువసేపు నీటిలో నానబెట్టకూడదు. కోసిన ఉల్లిగడ్డను ఎక్కువసేపు బయట పెట్టకుండా త్వరగా వాడేయాలి.

ఉల్లిగడ్డలు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ నల్లటి మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బ్లాక్ ఫంగస్ పూర్తిగా వ్యాపించిన ఉల్లిగడ్డలు తినకపోవడమే మంచిది. ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రంగా, మంచి నాణ్యత గల ఉల్లిగడ్డలనే వాడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News