Saturday, November 15, 2025
Homeలైఫ్ స్టైల్Black Tea vs Black Coffee: బ్లాక్ టీ vs బ్లాక్ కాఫీ..ఈ రెండిట్లో దేని...

Black Tea vs Black Coffee: బ్లాక్ టీ vs బ్లాక్ కాఫీ..ఈ రెండిట్లో దేని వలన ఆరోగ్యానికి ఎక్కువ బెనిఫిట్స్ అంటే..?

Black Tea vs Black Coffee Benefits: చాలామందికి ఉదయాన్నే టీ లేదా కాఫీ తాగనిదే రోజూ గడవదు. కొందరు టీ తాగడానికి ఇష్టపడితే,  మరికొందరు కాఫీ తాగడానికి మొగ్గు చూపుతారు. టీ, కాఫీ రెండూ బలే రుచిగా ఉంటాయి. అందుకే చాలామంది  చాలా మంది కప్పులు కప్పులు తాగుతుంటారు. అయితే, కొంతమంది బ్లాక్ టీ, బ్లాక్ కాఫీలను తాగడానికి ఇష్టపడుతుంటారు. ఇవి సాధారణ టీ, కాఫీల కంటే ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలామందికి ఈ బ్లాక్ టీ లేదా బ్లాక్ కాఫీ లో ఏది ఆరోగ్యానికి మంచిది అనే ప్రశ్న తలెత్తుతోంది. మరి ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? దేనిలో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
కెఫిన్ కంటెంట్:
ఈ రెండు పానీయాలలో కెఫిన్ ఉంటుంది. ఇది అలసట నుండి ఉపశమనం పొందడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. కానీ మొత్తంలో గణనీయమైన తేడా కాస్త కూడా ఉంటుంది. ఇకపోతే బ్లాక్ కాఫీ లో చాలా ఎక్కువ కెఫిన్ కంటెంట్ ఉంటుంది. దీన్ని తాగిన వెంటనే తక్షణ శక్తిని అందిస్తుంది. ఈ డ్రింక్ జిమ్‌కు వెళ్లేవారికి లేదా ఇతర శారీరక శ్రమ చేసేవారికి సరైనది. అయితే, అధిక కెఫిన్ కంటెంట్ కొంతమందిలో ఆమ్లత్వాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. మరోవైపు బ్లాక్ టీ విషయానికి వస్తే..  ఇందులో కాఫీ కంటే తక్కువ కెఫిన్ ఉంటుంది. టీలో L-థియనిన్ అనే సమ్మేళనం కూడా ఉంటుంది. ఇది కెఫిన్ ఉత్తేజపరిచే ప్రభావాలను సమతుల్యం చేస్తుంది. అందువల్ల ఇది క్రమంగా, దీర్ఘకాలిక శక్తిని అందిస్తుంది
యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్య ప్రయోజనాలు:
బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ రెండింటిలోనూ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి. బ్లాక్ కాఫీ తాగడం ద్వారా జీవక్రియను వేగవంతం చేస్తుంది. బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గుండె, కాలేయ ఆరోగ్యానికి మంచి యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఇది మానసిక స్థితిని సైతం మెరుగుపరుస్తుంది. ఇకపోతే, బ్లాక్ టీ ఫ్లేవనాయిడ్లు, థియఫ్లావిన్లు వంటి ప్రత్యేక యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించడంలో కాఫీ కంటే అద్భుతంగా పనిచేస్తుంది.
ఆరోగ్యానికి ఏది మంచిది?
బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో పూర్తిగా అవసరాలపై ఆధారపడి ఉంటుంది. కఠినమైన వ్యాయామం చేయడానికి ముందు లేదా ఉదయం చురుకుగా ఉండటానికి, తక్షణ శక్తి అవసరమైతే బ్లాక్ కాఫీ ఉత్తమం అని చెప్పవచ్చు. అయితే, అధిక రక్తపోటు లేదా గుండె సమస్యలు ఉంటే, బ్లాక్ కాఫీ తీసుకోవడం పరిమితం చేయాలని గుర్తుంచుకోండి. అధిక కెఫిన్ తీసుకోవడం నియంత్రించాలనుకుంటే, కడుపు ఆరోగ్యం మంచిగా ఉండాలంటే బ్లాక్ టీ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది రోజంతా శక్తివంతంగా, చురుగా ఉండేలా చేస్తుంది. గుండె ఆరోగ్యానికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad