Homeలైఫ్ స్టైల్Butter Run Trend: బటర్ రన్ ట్రెండ్..ఫిట్‌నెస్‌కు కొత్త మజా

Butter Run Trend: బటర్ రన్ ట్రెండ్..ఫిట్‌నెస్‌కు కొత్త మజా

Butter Run Trend: ఫిట్‌నెస్ ప్రపంచంలో రోజుకో కొత్త ట్రెండ్ పుట్టుకొస్తూనే ఉంటుంది. అందులో తాజాగా ఆకట్టుకుంటున్న వినూత్న కాన్సెప్ట్ ‘బటర్ రన్ ట్రెండ్’. ఏంటి ఇదేం ట్రెండ్‌ అని ఆశ్చర్యపోతున్నారా?ఇందులో ఉన్న ఐడియా, బెనిఫిట్స్‌ తెలిస్తే మాత్రం సర్ప్రైజ్‌ అవ్వాల్సిందే. వ్యాయామాన్ని పాకశాస్త్రంతో కలిపిన ఈ కొత్త విధానం ఇప్పుడు ఫిట్‌నెస్ ప్రియులను బాగా ఆకట్టుకుంటోంది.

- Advertisement -

ఫ్రెష్ మీగడతో పరుగులు
ఈ ట్రెండ్‌లో పాల్గొనేవారు ఓ జిప్‌లాక్ బ్యాగులో తాజా మీగడను తీసుకుని పరిగెత్తడం మొదలుపెడతారు. దీనితో సుమారు 8 నుంచి 10 కిలోమీటర్ల వరకు పెరుగెడుతారు. రన్నింగ్‌ సమయంలో శరీరం కదలికతో పాటు బ్యాగ్‌లో ఉన్న మీగడ కూడా నిరంతరం కదులుతూ ఉంటుంది. ఆ కదలిక వల్ల మీగడ కూడా అటూ ఇటూ కదులుతూ ఉంది. ఈ ప్రాసెస్‌లో అది చిలికినట్టుగా అవ్వడంతో అందులో వాటర్‌, థిక్‌ కనిసిస్టెన్సీ వేరు అవుతుంది. దీంతో అది మీగడ నుంచి వెన్నగా మారుతుంది. అలా అయ్యిందంటే మీరు ఆ రోజు హెల్తీ రన్నింగ్‌ చేసినట్టు అర్థం.

ఫైనల్ గా బటర్ ఇలా..
ఇలా పరిగెత్తుతూ వెన్న తయారు చేసుకోవడం ఈ ట్రెండ్‌ ముఖ్య ఉద్దేశం. రన్ పూర్తయ్యే సరికి చేతిలో సిద్ధంగా ఉండే నేచురల్ వెన్నను ఇంటికి తీసుకెళ్లి ఆనందంగా ఆస్వాదిస్తారు. దీనివల్ల ఒకవైపు శరీరానికి మంచి వ్యాయామం లభిస్తుండగా మరోవైపు స్వచ్ఛమైన ఆహారం సిద్ధం అవుతుండటంతో ఈ ట్రెండ్ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టే యువత ఈ బటర్ రన్‌ను కొత్త ఛాలెంజ్‌గా తీసుకుంటున్నారు. ఫిట్‌నెస్ లక్ష్యాలను చేరుకోవడంలో ఈ ట్రెండ్ స్ఫూర్తిగా మారుతుంది. సాధారణ రన్నింగ్‌ను మరింత ఆసక్తికరంగా మార్చుతోంది. దీంతో రన్నింగ్ ట్రాక్స్, ఫిట్‌నెస్ గ్రూప్స్‌లో ఈ ట్రెండ్ వేగంగా పాపులర్ అవుతోంది. మొత్తానికి, పరిగెత్తడాన్ని ఒక సరదా అనుభవంగా మార్చుతూ, ఆరోగ్యం మరియు ఆహారాన్ని కలిపిన ఈ బటర్ రన్ ట్రెండ్ ఫిట్‌నెస్ ప్రపంచంలో కొత్త మజాను తెచ్చిందనే చెప్పాలి.

Also Read: Bejeweled Trend: బిజువెల్డ్ ట్రెండ్.. ఫ్యాషన్‌లో కొత్త ట్రెండ్‌!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News