నిర్మల్1: నిర్మల్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం జన సందోహంతో ఘనంగా జరిగింది. ప్రముఖ సినీనటి ఐశ్వర్య రాజేష్ ఉత్సాహంగా ప్రారంభించారు. అందరికీ అందుబాటు ధరల్లో వన్ స్టాప్ మాల్ సీబీయస్ (చందన బ్రదర్స్ షాపింగ్ మాల్) నిర్మల్, బోయివాడ, నటరాజ్ నగర్‌లో ప్రారంభం కావడం ఎంతో సంతోషదాయకమని అన్నారు.
షోరూం మేనేజింగ్ డైరెక్టరు జానా సురేష్ మాట్లాడుతూ.. 40 సంవత్సరాల అనుబంధ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించిన ప్రతి చోటా అతి తక్కువ కాలంలోనే అక్కడి ప్రజల మన్ననలతో నెం.1 షోరూంగా నిలుస్తుండడం తమకు ఎంతో ఉత్సాహాన్ని, మరిన్ని ప్రదేశాలలో ప్రారంభించాలనే ప్రోత్సాహాన్ని అందిస్తుందని, నిర్మల్ విషయంలోనైతే షోరూం తీర్చిదిద్దడంలో గాని, ఇక్కడి ప్రజల అభిరుచికి సరిపడే వస్త్రాలు ఎంపిక చేయడంలో గాని ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల ఇక్కడి కస్టమర్ల అభిమానాన్ని మరింత వేగంగా పొందుతామనడంలో తమకు అపారమైన నమ్మకంమందని తెలియజేసారు. అన్ని ఆదాయ వర్గాలకూ అందుబాటు ధరలలో నాణ్యమైన సంప్రదాయ వస్త్రాలనూ అలానే మోడ్రన్ ఫ్యాషన్లనందించడంలో మరింత ముందుటామని అదే తమ విజయరహస్యమని తెలియజేసారు. ప్రారంభోత్సవ, దసరా, దీపావళి వేడుకల సందర్భంగా అన్ని రకాల వస్త్రాలపై తగ్గింపు ధరలతో మా కస్టమర్స్‌కి అందిస్తున్నామన్నారు.

ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. ప్రారంభోత్సవంలో భాగం కావడం ఎంతో సంతోషకరమని, నిర్మల్‌లో ప్రతి చిన్న అవసరానికి, అది ఇంట్లో ఏ ఫంక్షన్లకైనా, షూటింగ్ కాస్ట్యూంలకైనా తాము మొదటిగా వెళ్లేది సీబీఎస్‌కేనని, ఇక్కడ లభించే డిజైన్లూ – వెరైటీలూ వేరెక్కడా లభించవని, అందుకే ఇది హైదరాబాదీల ఫేవరెట్ షోరూంగా మారిందని అన్నారు.
కస్టమర్ల కోలాహలం
ఇక మొదటిగా తామే షాపింగ్ చేయాలని వచ్చిన కస్టమర్ల ఆనందానికైతే హద్దేలేకుండా పోయింది. ముఖ్యంగా స్త్రీల సంతోషం పట్టనలవికాకుండా ఉంది. ప్రారంభోత్సవ ఆఫర్లతో అతి తక్కువ ధరలతో ఉన్న చీరలను చూసి మురిసిపోతూ షాపింగ్ బుట్టలలో చీరలను నింపేయడం ప్రతి ఫ్లోర్లోనూ కనిపించింది.

