Saturday, June 7, 2025
Homeలైఫ్ స్టైల్నెల రోజులు టీ తాగకపోతే.. శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా..?

నెల రోజులు టీ తాగకపోతే.. శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా..?

భారతదేశంలో చాలామంది జీవితాల్లో టీ ఒక భాగంగా మారిపోయింది. తెల్లవారు జామున నిద్ర లేవగానే టీ కావాలి. మధ్యాహ్నం బ్రేక్ టైమ్‌లో టీ ఉంటేనే మూడ్ బాగుంటుంది. టీ లేకుండా రోజే సాగదని చెప్పే వారెందరో. అలాంటి వారి కోసం ఓ ఆసక్తికరమైన విషయం తెలుస్తోంది. ఒక నెల రోజులపాటు టీ తాగకపోతే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో, ఆరోగ్యం మీద దాని ప్రభావం ఎలా ఉంటుందో ఈ కథనంలో తెలుసుకుందాం.

- Advertisement -

టీ తాగకపోతే ముందుగా ఎదురయ్యే లక్షణం శరీరంలో కెఫిన్ తక్కువ కావడం. టీలో ఉండే కెఫిన్ ఒక సహజ ఉత్ప్రేరకం. ఇది మనల్ని అలసట లేకుండా ఉత్సాహంగా ఉంచుతుంది. కానీ దాన్ని ఒక్కసారిగా మానేసినప్పుడు శరీరం కొంత గందరగోళానికి లోనవుతుంది. కెఫిన్ లేకపోవడం వల్ల తలనొప్పులు, నిస్సత్తువ, నిద్రమత్తు వంటి లక్షణాలు తలెత్తే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మూడ్ మార్పులు కూడా కనిపించవచ్చు.

అంతేకాదు, టీ తాగడం ద్వారా మనం పొందే యాంటీ ఆక్సిడెంట్లు కూడా బాగా ఉపయోగపడతాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌కి వ్యతిరేకంగా పని చేస్తూ, బలహీనతలకు తావివ్వకుండా చేస్తాయి. టీ తాగకపోతే ఈ సహజ రక్షణ తగ్గిపోతుంది. దీని ప్రభావంగా చర్మంపై ప్రభావం, జీర్ణక్రియ మందగించడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

కొందరికి మానసికంగా టీపై అధిక ఆధారపడే అలవాటు ఏర్పడినప్పుడు, దాన్ని ఒక్కసారిగా మానేయడం వల్ల ఒత్తిడి, కంగారు వంటి లక్షణాలు కలగవచ్చు. అయినా, దీన్ని పూర్తిగా తక్కువ చేసి, క్రమంగా మానుకుంటే శరీరం ఒక సమతుల్య స్థితికి వచ్చి, నెమ్మదిగా మార్పులు స్వీకరిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే టీ మానేస్తే మొదట కొన్ని ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చూ.. కానీ కొన్ని వారాల తర్వాత శరీరం కొత్త శైలికి అలవాటుపడుతుంది. అయితే దీన్ని డాక్టర్ గైడెన్స్‌తో చేయడం ఉత్తమం. టీ తాగడం ఆరోగ్యానికి మంచిదే అయినా.. దాని మీద ఆధారపడే స్థాయికి వెళ్లకూడదని నిపుణుల హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News