Check with these 5 easy tips to loose Belly fat: వయసుతో సంబంధం లేకుండా పొట్ట చుట్టూ కొవ్వుతో చాలా మంది బాధపడుతుంటారు. పొట్ట తగ్గించుకోవడానికి రకరకాల డైట్లు, వ్యాయామాలు, సప్లిమెంట్లు ఫాటో అవుతుంటారు. అయినప్పటికీ ఫలితం లేక పొట్ట తగ్గించడం కష్టమని నిట్టూరుస్తుంటారు. అయితే, ఒక ప్రణాళిక బద్ధంగా శ్రమిస్తే, అలవాట్లు మార్చుకుంటే పొట్ట కొవ్వును కరిగించవచ్చని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ పాల్ మాణిక్యం చెబుతున్నారు. ఇందుకోసం ఇంట్లోనే కొన్ని సులభమైన టిప్స్ పాటిస్తే సరిపోతుంది. అవేంటో చూద్దాం.
Also read: Ameerpet: అమీర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం.. షాపింగ్ కాంప్లెక్స్‌లో వేగంగా అంటుకున్న మంటలు..!
1. ఆహారాన్ని పూర్తిగా మానేయొద్దు
బరువు తగ్గాలనుకునే వారు చేసే అతిపెద్ద పొరపాటు డైటింగ్ చేయడం. అంటే తిండిని పూర్తిగా మానేయడం. ఇలా తిండిని పూర్తిగా తగ్గించడం వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్లు పెరిగి పొట్ట చుట్టూ కొవ్వు మరింతగా పేరుకుపోతుందని డాక్టర్ పాల్ హెచ్చరిస్తున్నారు. మీ ఆహార పరిమాణాన్ని కొద్దిగా తగ్గించుకుంటే సరిపోతుందని సలహా ఇస్తున్నారు.
2. ప్రొటీన్ ఆహారాన్ని తీసుకోవాలి
పొట్ట చుట్టూ కొవ్వు తగ్గించడంలో ప్రొటీన్ ఒక అద్భుతమైన ఆయుధంగా పనిచేస్తుంది. ప్రోటీన్ మీకు కడుపు నిండిన అనుభూతిని ఇవ్వడమే కాకుండా పదే పదే చిరుతిళ్లు తినాలనే కోరికను తగ్గిస్తుంది. అలాగే కండరాల రక్షణకు, రక్తంలో షుగర్ లెవల్స్‌ను కంట్రోల్‌లో పెట్టడానికి ఎంతగానో తోడ్పడుతుంది. అందుకే ఆహారంలో ప్రొటీన్ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి.
3. రోజూ శరీరాన్ని కదిలించాలి
పొట్ట కొవ్వు తగ్గించడానికి రోజూ జిమ్‌కు వెళ్లి భారీ వర్కవుట్స్ చేయాల్సిన పని లేదు. రోజూ కాసేపు నడవడం, తేలికపాటి వర్కవుట్స్ చేయడం కూడా మంచి ఫలితాలనిస్తుంది. ఒకేసారి ఎక్కువ సమయం వర్కౌట్లు చేయడం కంటే.. రోజూ కాస్త శరీరాన్ని కదిలించడం ముఖ్యమని గమనించాలి.
4. శరీరానికి సరిపోయే నిద్ర పోవాలి
పొట్ట పెరగడానికి నిద్రలేమి కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. సరైన నిద్ర లేకపోవడంతో ఆకలిని పెంచే హార్మోన్లు విడుదలై.. పదే పదే ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తినాలనిపిస్తుంది. ఇది రక్తంలో షుగర్ లెవల్స్ పెంచేందుకు దారితీస్తుంది. క్రమంగా కొవ్వు అంతా పొట్ట భాగంలోనే పేరుకుపోయేలా చేస్తుంది. కాబట్టి, పొట్ట తగ్గాలనుకునే వారు ప్రతి రోజు కనీసం 7 నుంచి 9 గంటల పాటు నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు.
5. మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవాలి
మానసిక ఒత్తిడి అతిపెద్ద శత్రువు లాంటిది. దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసాల్ లెవల్స్ పెరిగి పొట్ట చుట్టూ కొవ్వు పేరుకు పోతుంది. అందుకే, మానసిక ప్రశాంతత కొరకు ధ్యానం, ప్రకృతిలో నడవడం లేదా నచ్చిన అలవాట్లకు ఎక్కువ సమయం కేటాయించడం వంటివి చేయాలి.

