Biscuits Vs Chocolate: గతంతో పోలిస్తే నేటి జీవనశైలి పూర్తిగా మారిపోయిందని చెప్పవచ్చు. ఒకప్పుడు చాలామంది ఇంట్లో చేసుకునే ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండేవారు. కానీ, ఇప్పుడు నోటి రుచి కోసం బయటి ఆహారం ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇది అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది. అయితే, ముఖ్యంగా పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే చాక్లెట్లు, బిస్కెట్లు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాక్లెట్ లో ఉండే అధిక షుగర్ కంటెంట్ ఉబకాయం, రక్తంలో చక్కర స్థాయిలను పెంచితే, బిస్కెట్లలో దాచిన కొవ్వులు, శుద్ధి చేసిన పిండి ఆరోగ్యానికి ప్రమాదకరమని చెబుతున్నారు. వీటికి బదులుగా పండ్లు, తాజా కూరగాయలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో చాక్లెట్ లేదా బిస్కెట్ మన ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో? వీటిలో ఏది అత్యంత ప్రమాదకరమో? ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Biscuits Vs Chocolate: చాక్లెట్ లేదా బిస్కెట్ ..ఆరోగ్యానికి ఏది మంచిది..? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు!
చాక్లెట్ ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరం?
చాక్లెట్ ఆరోగ్యకరమైనదా? కాదా? అనేది చాక్లెట్ ఎంచుకున్న రకాన్ని బట్టి ఉంటుంది. కొన్ని నివేదికల ప్రకారం..డార్క్ చాక్లెట్ లో కనిపించే ఫ్లెవనాయిడ్లు వంటి యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. దీన్ని మితంగా తీసుకోవడం వల్ల రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని కూడా కొన్ని అధ్యాయానాలు చెబుతున్నాయి. అయితే, ఈ ప్రయోజనాలు కేవలం అధిక కోకో- డార్క్ చాక్లెట్ లో మాత్రమే కనిపిస్తాయి. ఇక వాణిజ్యపరంగా లభించే మిల్క్ చాక్లెట్ లేదా వైట్ చాక్లెట్ ఆరోగ్యానికి అసలు మంచిది కాదంటున్నారు. ఎందుకంటే వీటిలో చాలా తక్కువ కోకో ఉంటుంది. అంతేకాదు చక్కెర కంటెంట్, కొవ్వు అధికంగా ఉంటుంది. కావున వీటిని అధికంగా తీసుకుంటే ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, దంత సమస్యలకు దారితీస్తుందని కొన్ని వైద్య నివేదికలు సూచిస్తున్నాయి.
బిస్కెట్ ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరం?
బిస్కెట్లు దాదాపు ప్రతి ఇంట్లో తీసుకునే సులభమైన చిరుతిండి. అయితే, ఒక నివేదిక ప్రకారం..మార్కెట్లో విక్రయించే చాలా బిస్కెట్లు శుద్ధి చేసిన పిండి, హైడ్రోజనేటేడ్ నూనెలు, అదనపు చక్కెరతో తయారుచేస్తారు. ఇవి కేవలం కేలరీలను మాత్రమే అందిస్తాయి. అంటే దీని అర్థం శక్తిని అందిస్తాయని! కానీ, ఈ బిస్కెట్లలో ఎలాంటి విటమిన్లు, ఫైబర్, ఖనిజాలు వంటి పోషకాలు ఉండవు. ఇక కొన్ని రకాల బిస్కెట్లు అధిక గ్లైసిమిక్ సూచికను కలిగి ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతాయి. ఆకలికి దారితీస్తుంది. బిస్కెట్లు తరచుగా తీసుకోవడం వల్ల బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు ఇన్సులిన్ నిరోధకత, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలకు కూడా దారితీస్తుంది.
ఏది అత్యంత ప్రమాదకరమైనది
చాక్లెట్ లేదా బిస్కెట్.. సాధారణ పరిస్థితులలో పోలిస్తే చాక్లెట్ కంటే బిస్కెట్ ఎక్కువ హానికరంగా పరిగణించవచ్చు. ఎందుకంటే బిస్కెట్లలో ట్రాన్స్ ఫ్యాట్, శుద్ధి చేసిన పిండి, ప్రిజర్వేటివ్ లు అధికంగా ఉంటాయి. మరోవైపు కొన్ని చాక్లెట్లను పరిమిత పరిమాణంలో, కోకో కంటెంట్ కారణంగా గుండె, మెదడు రెండిటికి ప్రయోజనకరంగా ఉంటాయి.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES


