Homeలైఫ్ స్టైల్CMR: వనస్థలిపురంలో CMR షాపింగ్ మాల్ ప్రారంభం.. సందడి చేసిన మీనాక్షి చౌదరి

CMR: వనస్థలిపురంలో CMR షాపింగ్ మాల్ ప్రారంభం.. సందడి చేసిన మీనాక్షి చౌదరి

హైదరాబాద్: నాణ్యత, విస్తృతమైన కలెక్షన్లు, వినియోగదారుల సంతృప్తికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్న CMR షాపింగ్ మాల్, నేడు వనస్థలిపురంలో తన నూతన షోరూమ్‌ను ఘనంగా ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవంతో వనస్థలిపురం, పరిసర ప్రాంతాల ప్రజలకు సరికొత్త షాపింగ్ అనుభూతిని అందుబాటులోకి తీసుకువచ్చింది.

- Advertisement -

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి మీనాక్షి చౌదరి ముఖ్య అతిథిగా హాజరై నూతన షోరూమ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో CMR గ్రూప్ ఛైర్మన్ మావూరి వెంకట రమణ, డైరెక్టర్ మావూరి బాలాజీ పాల్గొన్నారు. అదేవిధంగా మాజీ ఎంపీ, ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్ మధు యాష్కీ గౌడ్, తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్లారెడ్డి రెడ్డి, ఎల్బీ నగర్ బీజేపీ ఇన్ఛార్జ్ సామ రంగారెడ్డి, మాజీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, ల్యాండ్గార్డ్, ఎక్స్ కౌన్సిలర్, యాదగిరిగుట్ట బోర్డు మెంబర్ పి. ఈశ్వరమ్మ యాదవ్‌, షోరూమ్ యజమాని పి. కృష్ణ యాదవ్, సురేష్ యాదవ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ ప్రారంభోత్సవంలో తొలి కొనుగోలుదారుగా పి. కృష్ణ యాదవ్ నిలిచారు. ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి మాట్లాడుతూ, CMR షాపింగ్ మాల్‌లోని చీరల కలెక్షన్లు తనకు ఎంతో నచ్చాయని, తాను కూడా తరచుగా CMRలో షాపింగ్ చేస్తుంటానని తెలిపారు. ఇక్కడ లభించే విభిన్నమైన చీరల డిజైన్లు, కలెక్షన్ల పట్ల తనకున్న అభిరుచిని ఆమె వెల్లడించారు. వనస్థలిపురం ప్రజలకు తనపై ఎంతో అభిమానం ఉందని, అదే విధంగా తనకూ ఇక్కడి ప్రజలంటే ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. అనంతరం వేదికపైనే పాటలకు నృత్యం చేస్తూ ప్రేక్షకులను అలరించారు. దీంతో ప్రారంభోత్సవ వేడుక మరింత ఉత్సాహభరితంగా మారింది.

నూతనంగా ప్రారంభమైన CMR షాపింగ్ మాల్‌లో చీరలు, సంప్రదాయ దుస్తులు, పురుషులు, మహిళలు, చిన్నారుల వస్త్రాలతో పాటు విభిన్నమైన ఫ్యాషన్, లైఫ్ స్టైల్ కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. అన్ని వయసుల వారికి, కుటుంబ సభ్యులందరికీ ఒకే చోట విస్తృతమైన షాపింగ్ సౌకర్యాన్ని అందించేలా మాల్ను రూపొందించారు.

ఈ సందర్భంగా CMR షాపింగ్ మాల్ చైర్మన్ మావూరి వెంకట రమణ మాట్లాడుతూ.. వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను, ఆకర్షణీయమైన ధరలను అందించడంతో పాటు ప్రతి షాపింగ్‌ను ఒక మధురమైన అనుభూతిగా మార్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. వినియోగదారుల ఆదరణతో మరిన్ని ప్రాంతాలకు తమ సేవలను విస్తరిస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు.

ప్రారంభోత్సవ కానుకగా ప్రింటెడ్ క్రీప్ సారీ కేవలం 89 రూపాయలకే అందిస్తూ మరెన్నో అద్భుతమైన ఆఫర్లను అన్ని కేటగిరీస్‌లోను అందిస్తున్నామని తెలియజేశారు. వనస్థలిపురంలో నేటి నుంచి ప్రారంభమైన CMR షాపింగ్ మాల్ స్థానిక ప్రజలకు సరికొత్త షాపింగ్ గమ్యస్థానంగా నిలవనుంది. వనస్థలిపురం, పరిసర ప్రాంతాల ప్రజలందరూ నూతన షోరూమ్ను సందర్శించి, విస్తృతమైన కలెక్షన్లను ఆస్వాదించాలని సీఎంఆర్‌ యాజమాన్యం ఆహ్వానించింది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News