Hair care: మనలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే… జుట్టు సమస్యలకు పెద్ద కారణం షాంపూ కాదు, ఆయిల్ కాదు… తలస్నానం చేసే నీరు. అవును… మీరు రోజూ వాడే నీటి ఉష్ణోగ్రతే మీ జుట్టు భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కొందరు వేడి నీరు వాడితే క్లీన్గా ఉంటుంది అనుకుంటారు. ఇంకొందరు చల్లని నీళ్లే బెస్ట్ అంటారు. అసలు నిజం ఏంటి అంటే… రెండింటినీ సరైన విధంగా వాడితేనే జుట్టు హెల్తీగా ఉంటుంది.
చల్లని నీళ్ల ప్రభావం గురించి మాట్లాడితే
చల్లని నీటితో తలస్నానం చేసినప్పుడు స్కాల్ప్ మీద ఉన్న పోర్స్ క్లోజ్ అవుతాయి. దీని వల్ల జుట్టు మీద తేమ నిలిచిపోతుంది. జుట్టు డ్రై కాకుండా సాఫ్ట్‌గా మారుతుంది. ఫ్రిజ్జీ లుక్ తగ్గిపోతుంది. ముఖ్యంగా పొడవైన జుట్టు ఉన్నవాళ్లకు ఇది చాలా ఉపయోగం. జుట్టు మెరుపుగా కనిపిస్తుంది. చిక్కుబడటం తగ్గుతుంది. స్కాల్ప్‌లో సహజంగా ఉండాల్సిన ఆయిల్ బయటికి పోకుండా కాపాడుతుంది. డాండ్రఫ్ ఉన్నవాళ్లకు కూడా చల్లని నీళ్లు చాలా హెల్ప్ చేస్తాయి. స్కాల్ప్ డ్రై అవకుండా తగినంత తేమ ఇస్తుంది. హెయిర్ రూట్స్ బలపడతాయి. రోజూ బయట తిరిగే వాళ్లు, దుమ్ము కాలుష్యం ఎక్కువగా ఎదుర్కొనే వాళ్లు చివరగా చల్లని నీటితో రిన్స్ చేస్తే జుట్టు అప్‌డేటెడ్ లుక్‌లో కనిపిస్తుంది.
వేడి నీళ్ల సంగతి చూస్తే…
వేడి నీరు స్కాల్ప్‌లో పేరుకుపోయిన మురికి, ఆయిల్, స్టైలింగ్ ప్రొడక్ట్స్‌ని త్వరగా క్లీన్ చేస్తుంది. ఆయిల్ పెట్టుకున్న తర్వాత వేడి నీటితో కడిగితే ఆయిల్ ఈజీగా పోతుంది. హెయిర్ రూట్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి షాంపూ లోపల వరకు పని చేస్తుంది. కానీ ఇక్కడే అసలు సమస్య. ఎక్కువ వేడి నీరు వాడితే స్కాల్ప్‌లో ఉండాల్సిన నేచురల్ ఆయిల్ మొత్తం పోతుంది. దాంతో జుట్టు రఫ్ అవుతుంది. డ్రై అవుతుంది. స్ప్లిట్ ఎండ్స్ పెరుగుతాయి. కొంతకాలానికి హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. కొందరికి స్కాల్ప్‌లో మంట, దురద కూడా వస్తుంది. అంటే వేడి నీరు క్లీన్ చేస్తుంది కానీ అతిగా వాడితే జుట్టు ఆరోగ్యాన్ని నెమ్మదిగా నాశనం చేస్తుంది.
Read Also: IRCTC Tour Package: ప్రకృతి ఒడిలో 5 రోజుల హ్యాపీ జర్నీ.. బడ్జెట్ కేవలం రూ.10,800 మాత్రమే
సరైన పద్ధతి ఏంటి అంటే…
తలస్నానం మొదట మోస్తరు వేడి నీటితో చేయాలి. దీనివల్ల స్కాల్ప్‌లో ఉన్న మురికి బయటకు వస్తుంది. షాంపూ బాగా పనిచేస్తుంది. తర్వాత చివరగా తప్పకుండా చల్లని నీటితో రిన్స్ చేయాలి. ఇలా చేస్తే ఓపెన్ అయిన హెయిర్ పోర్స్ మళ్లీ క్లోజ్ అవుతాయి. జుట్టులో తేమ లాక్ అవుతుంది. సహజమైన షైన్ వస్తుంది. ఈ చిన్న అలవాటు రోజూ పాటిస్తే జుట్టు స్ట్రాంగ్‌గా మారుతుంది.
ముఖ్యమైన విషయం…
రోజూ వేడి నీటితో తలస్నానం చేసే అలవాటు ఉంటే వెంటనే మార్చుకోవాలి. వారానికి 2 లేదా 3 సార్లు మాత్రమే మోస్తరు వేడి నీరు వాడాలి. మిగతా రోజుల్లో సాధ్యమైనంతవరకు చల్లని నీళ్లు ఉపయోగించాలి. వేసవిలో చల్లని నీరు స్కాల్ప్‌ని రిలాక్స్ చేస్తుంది. చలికాలంలో పూర్తిగా వేడి నీరు కాకుండా లూక్‌వామ్ బెస్ట్.
వీరు వేడి నీటికి దూరంగా ఉంటే బెస్ట్
జుట్టు ఎక్కువగా రాలిపోతున్నవాళ్లు, పలుచబడుతున్నవాళ్లు వేడి నీటికి దూరంగా ఉండాలి. చల్లని నీరు స్కాల్ప్‌లో బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. హెయిర్ రూట్స్‌కు తగినంత పోషణ అందుతుంది. దీంతో కొత్త జుట్టు రావడానికి కూడా సహాయం జరుగుతుంది. కలర్ చేసిన జుట్టు ఉన్నవాళ్లకు అయితే చల్లని నీరు చాలా అవసరం. వేడి నీరు కలర్‌ని త్వరగా తీసేస్తుంది. చల్లని నీరు కలర్‌ని లాక్ చేస్తుంది.
ఇలా చేస్తే జట్టు రాలడం ఖాయం
తలస్నానం తర్వాత జుట్టును టవల్‌తో బలంగా రుద్దకూడదు. మెల్లగా నీరు ఒత్తాలి. వెట్ హెయిర్ మీద వెంటనే దువ్వకూడదు. ఇలా చేస్తే బ్రేకేజ్ తగ్గుతుంది. వారానికి కనీసం 1 సారి ఆయిల్ మసాజ్ చేయాలి. ఆయిల్ పెట్టిన రోజు మోస్తరు వేడి నీటితో కడిగి చివరగా చల్లని నీటితో రిన్స్ చేయడం చాలా మంచి కాంబినేషన్. వేడి నీరు క్లీనింగ్ కోసం. చల్లని నీరు జుట్టు హెల్త్ కోసం. రెండింటినీ బ్యాలెన్స్‌గా వాడితే ఖరీదైన ట్రీట్మెంట్స్ అవసరం ఉండదు. రోజూ చేసే ఈ చిన్న జాగ్రత్తలే పొడవైన మెరిసే జుట్టుకు అసలు సీక్రెట్. మీ జుట్టే మీ అందానికి మొదటి గుర్తింపు. కాబట్టి ఈరోజు నుంచే తలస్నానం చేసే నీటిపై కూడా శ్రద్ధ పెట్టండి.

