Homeలైఫ్ స్టైల్Makeup trend:కౌచర్ ఇన్‌స్పైర్డ్‌ మేకప్ ట్రెండ్

Makeup trend:కౌచర్ ఇన్‌స్పైర్డ్‌ మేకప్ ట్రెండ్

Couture-inspired makeup trend: కౌచర్ ఇన్‌స్పైర్డ్‌ మేకప్ ట్రెండ్‌ను ఫాలో అయ్యేందుకు సామాన్యులు ఆసక్తిచూపుతున్నారు. డిజైనర్ కలెక్షన్ల నుండి ప్రేరణపొందిన కళాత్మక అలంకరణలే కౌచర్ ఇన్స్పైర్డ్ మేకప్ ప్రత్యేకత. హై-ఫ్యాషన్ రన్వేలపై ఇలాంటి కౌచర్ ఇన్స్పైర్డ్ మేకప్ వేసుకుంటారు. ఇది చాలా డ్రమాటిక్‌గా ఉండి, క్రియేటివ్‌గా, స్పెషల్ డిజైన్స్, హైలైట్స్ తో ఆకట్టుకుని, ఆలోచింపచేసేలా ఉంటుంది. ముఖంలో ఏదైనా ఒక భాగం అంటే కళ్లు లేదా పెదవులు లేద బుగ్గలు ఇలా దేన్నైనా ప్రత్యేకంగా హైలైట్ చేయటం ఈ ఫ్యాషన్‌లో భాగం. డ్రెస్ లేదా ఫ్యాషన్ థీమ్‌కు తగినట్టు ముఖాన్ని కాన్వాస్‌లా తీర్చిదిద్దటం, సాధారణ మేకప్ నియమాలకు అతీతంగా కొత్త ప్రయోగాలు చేయటం ఇందులో ప్రత్యేకత. ఇప్పుడు ఈ కౌచర్ మేకప్ ట్రెండ్ పట్ల యువత ఆకర్షితులవుతుండటంతో ఫ్యాషన్ కొత్త పుంతలు తొక్కుతోంది.

- Advertisement -

Also read: IICT Foundation Day: ఘనంగా ఐఐసీటీ 83వ వ్యవ స్థాపక దినోత్సవం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News