Saturday, November 15, 2025
Homeలైఫ్ స్టైల్Diabetes: పండగలప్పుడు స్వీట్లు తిన్న షుగర్‌ లెవల్స్‌ పెరగకూడదంటే..!

Diabetes: పండగలప్పుడు స్వీట్లు తిన్న షుగర్‌ లెవల్స్‌ పెరగకూడదంటే..!

Diabetes- Sweets:భారతదేశంలో డయాబెటిస్ రోగుల సంఖ్య రోజురోజుకి ఎంత స్పీడుగా పెరుగుతోందో తెలిసిన విషయమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాచారం ప్రకారం, 45 ఏళ్లు దాటిన వారిలో సుమారు 20 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నటు కొన్ని అధ్యయానాలు చెబుతున్నాయి. అంటే దేశవ్యాప్తంగా 50 మిలియన్లకు పైగా ప్రజలు ఈ వ్యాధితో జీవిస్తున్నారు. పండుగల సమయంలో మాత్రం ఈ సమస్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజుల్లో ఎక్కువగా తీపి పదార్థాలు తీసుకోవడం అనేది చాలా మామూలు విషయం.

- Advertisement -

ఇన్సులిన్ సమతుల్యతను..

దీపావళి వంటి పండుగల్లో ప్రతి ఇంట్లోనూ లడ్డూ, రసగుల్లా, గులాబ్ జామున్ వంటి స్వీట్లు రెడీ చేస్తూనే ఉంటారనే సంగతి తెలిసిందే. వీటిలో చక్కెర, నెయ్యి ఎక్కువగా ఉండటంతో శరీరంలో గ్లూకోజ్ త్వరగా విడుదలవుతుంది. ఈ మార్పు డయాబెటిస్ ఉన్నవారిలో రక్త చక్కెర స్థాయిలను పెంచి, ఇన్సులిన్ సమతుల్యతను దెబ్బతీస్తుంది. కొన్ని పరిశోధనల ప్రకారం, పండుగ రోజులలో మధుమేహ రోగుల రక్త చక్కెర స్థాయిలు సాధారణ స్థాయితో పోలిస్తే 20 నుండి 30 శాతం వరకు పెరుగుతాయి.

Also Read:https://teluguprabha.net/devotional-news/venus-transit-brings-luck-to-five-zodiac-signs/

మితంగా తినడం, సమయానికి తినడం..

స్వీట్లు మాత్రమే కాకుండా, వేయించిన ఆహారం, ఒత్తిడి, నిద్రలోపం కూడా రక్త చక్కెరపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అయితే ముందుగానే ఆహార నియమాలు పాటించి, ఆహారాన్ని సమతుల్యంగా ప్లాన్ చేసుకుంటే ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.పండుగ రోజున రుచికరమైన ఆహారం తినడం మానడం సాధ్యంకాదు. కానీ మితంగా తినడం, సమయానికి తినడం వంటి అలవాట్లు చాలా కీలకం. ఉదాహరణకు స్వీట్లు తినే ముందు తగినంత ప్రోటీన్, ఫైబర్ ఉన్న ఆహారం తీసుకుంటే చక్కెర రక్తప్రవాహంలో నెమ్మదిగా విడుదలవుతుంది. దీనివల్ల రక్త చక్కెర ఒక్కసారిగా పెరగకుండా కాపాడుకోవచ్చు.

ఖాళీ కడుపుతో తీపి పదార్థాలు తినడం అత్యంత ప్రమాదకరం. అలాంటి సమయంలో చక్కెర వెంటనే రక్తంలోకి చేరి హఠాత్తుగా స్థాయిలను పెంచుతుంది. అందువల్ల కొద్దిగా పప్పులు, కూరగాయలు లేదా సలాడ్ తిన్న తర్వాత స్వీట్లు తీసుకోవడం ఆరోగ్యకరమైన మార్గం.మరొక ముఖ్యమైన విషయం భోజనానికి ముందు స్వీట్లు తినకూడదు. భోజనం తర్వాత స్వీట్లు తినడం వల్ల చక్కెర శోషణ మెల్లగా జరుగుతుంది. కూరగాయలు, పప్పులు వంటి ఆహార పదార్థాలు గ్లూకోజ్ శోషణను నియంత్రిస్తాయి.

మధుమేహ రోగులకు..

ఒకేసారి ఎక్కువ స్వీట్లు తినడం మధుమేహ రోగులకు హానికరం. శరీరానికి అవసరమైన ఇన్సులిన్ కంటే ఎక్కువ అవసరం పడుతుంది, దాంతో చక్కెర నియంత్రణ కష్టమవుతుంది. అందుకే కొద్దిగా మాత్రమే, అంతకంటే ఎక్కువ కాదు.ప్రోటీన్, ఫైబర్ కలిగిన ఆహారం డయాబెటిస్ ఉన్నవారికి చాలా ఉపయోగకరం. ఇది చక్కెర శోషణ వేగాన్ని తగ్గిస్తుంది, రక్త చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంచుతుంది. కాబట్టి పండుగల రోజుల్లో కూడా ఈ పదార్థాలు తప్పనిసరిగా భోజనంలో ఉండాలి.

స్వీట్లు ఎంచుకునేటప్పుడు కొవ్వు తక్కువగా ఉన్నవి లేదా ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగినవే తీసుకోవడం మంచిది. ఉదాహరణకు డ్రైఫ్రూట్స్‌తో లేదా స్వచ్ఛమైన నెయ్యితో తయారైన స్వీట్లు శరీరంలో చక్కెర స్థాయిని నెమ్మదిగా పెంచుతాయి. కానీ కొవ్వు లేకుండా కేవలం చక్కెరతో తయారైన పదార్థాలు రక్త చక్కెర స్థాయిలను వెంటనే పెంచుతాయి.

కృత్రిమ తీపి పదార్థాలు…

ఇప్పటి కాలంలో చాలా మంది కృత్రిమ తీపి పదార్థాలు కలిగిన స్వీట్లు ఉపయోగిస్తున్నారు. ఇవి కొంతమంది శరీరాల్లో గ్లూకోజ్ జీవక్రియను ప్రభావితం చేస్తాయి. అందుకే సహజమైన పదార్థాలతో తయారైన, తక్కువ చక్కెర కలిగిన స్వీట్లు తీసుకోవడం మంచిది.పండుగ రోజుల్లో రాత్రివేళ స్వీట్లు తినడం కూడా సరైన పద్ధతి కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాత్రి సమయంలో శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి స్థాయి తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో తీపి ఆహారం తీసుకుంటే ఉదయం హైపర్గ్లైసీమియా సమస్య తలెత్తే అవకాశం ఉంది.

Also Read:https://teluguprabha.net/devotional-news/story-behind-bhagini-hasta-bhojanam-festival-after-diwali/

ఆపిల్ సైడర్ వెనిగర్‌..

అంతేకాకుండా, పండుగ రోజుల్లో ఎక్కువగా స్వీట్లు తిన్నట్లయితే భోజనం అనంతరం ఒక టీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్‌ను అర గ్లాస్ నీటిలో కలిపి త్రాగడం రక్త చక్కెర నియంత్రణకు సహాయపడుతుంది. ఇది చక్కెర శోషణ వేగాన్ని తగ్గించి, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad