King Cobra Speed: ప్రపంచంలోనే అత్యంత పొడవైన విష సర్పాలలో ఒకటి కింగ్ కోబ్రా. అయితే దాని వేగం పలు సినిమా కథనాల్లో మనిషి కంటే ఎక్కువగా ఉంటుందని చూపిస్తున్నారు. అయితే అది వాస్తవమా.. నిజానికి మనిషి వేగం కంటే ఎక్కువగా ఉంటుందా లేదా తెలుసుకుందాం.
కింగ్ కోబ్రా విషయంలో మనకున్న అపోహలకు పూర్తి భిన్నంగా దాని వేగం ఉంటుంది. నిజానికి దానివేగం మనిషి కంటే చాలా తక్కువ. కింగ్ కోబ్రా గరిష్ట వేగం గంటకు సుమారు 12 నుండి 20 కిలోమీటర్లు (7.5 నుండి 12.4 మైళ్లు) మాత్రమే. అయితే ఈ వేగాన్ని కూడా అది అత్యంత భయంకరమైన పరిస్థితుల్లో లేదా పారిపోయేటప్పుడు మాత్రమే చేరుకుంటుంది. చాలా అరుదుగా మాత్రమే ఇది ఇంత వేగంగా కదులుతుంది.
మనిషి వేగంతో పోలిక: కింగ్ కోబ్రా వేగాన్ని మనిషి వేగంతో పోలిస్తే తేడా స్పష్టంగా తెలుస్తుంది. ఒక సాధారణ, ఆరోగ్యవంతుడైన మనిషి వేగంగా నడిచినా లేదా నెమ్మదిగా పరిగెత్తినా గంటకు 6 నుండి 8 కిలోమీటర్ల వేగాన్ని సులభంగా చేరుకోగలడు. శిక్షణ పొందిన పరుగు పందెం వీరులు గంటకు 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో పరిగెత్తగలరు. అత్యంత వేగంగా పరిగెత్తే మనుషులు గంటకు ఏకంగా 35 కి.మీ. వేగాన్ని కూడా తాకగలరు. ఒక సాధారణ మనిషి కింగ్ కోబ్రా కనిపించినప్పుడు నిలబడి పరిగెత్తడం మొదలుపెడితే దానికంటే సులభంగా, వేగంగా తప్పించుకోగలడు.
Also Read:https://teluguprabha.net/lifestyle/marriage-relationship-strengthening-family-tips/
ఇదే దాని విజయ రహస్యం: పాములు తమ వేట కోసం పొంచి ఉండి.. సరైన సమయం కోసం ఎదురుచూస్తాయి. అవి కేవలం కొద్ది దూరం మాత్రమే వేగంగా దూకి కాటు వేయగలవు. అయితే ఆ చిన్నపాటి వేగమే దానిని ప్రమాదకరమైన పాముగా మారుస్తుంది.
గుర్తుంచుకోవాల్సిన విషయం: కింగ్ కోబ్రా శక్తివంతమైన వేటగాడు. అంతేకాకుండా దాని విషం చాలా ప్రమాదకరమైనది. దాని పరుగు వేగం గురించి భయపడాల్సిన అవసరం లేకపోయినా.. ఈ ముఖ్యమైన విషయాన్ని మర్చిపోకూడదు. ఎప్పుడూ ఈ పాముకు చాలా దూరంగా పాటించడం ఉత్తమం. కింగ్ కోబ్రా వేగం తక్కువగా ఉన్నప్పటికీ.. దానిని దగ్గరగా వెళ్లి ఆటపట్టించడం లేదా రెచ్చగొట్టడం అస్సలు చేయకూడదు. దానికి అడ్డు పడకుండా.. దాని దారిన దానిని వదిలేయడమే అత్యుత్తమ మరియు సురక్షితమైన మార్గం.


