Pine apple Juice Disadvantages: ఆరోగ్యం పూర్తిగా మనం తీసుకునే కూరగాయలు, పండ్లు పై ఆధారపడి ఉంటుంది. పండ్లలో బాగంగా పైనాపిల్ పండును తింటాం. ఇది ఎంతో రుచికరమైన, అనేక పోషకాలు ఉన్న పండు. పైనాపిల్ రసం తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉన్న విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఎంజైమ్ లు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఎంతో సహాయ పడతాయి. కానీ దేన్నైనా అతిగా తీసుకోవడం అంత మంచిది కాదు.
పైనాపిల్ రసాన్ని అధికంగా తీసుకుంటే అది శరీరంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. దీని అధిక వినియోగం కడుపు సమస్యల నుండి రక్తంలో షుగర్ లెవల్స్, మూత్రపిండాల ఆరోగ్యం వరకు అనేక సమస్యలను కలిగిస్తుంది. అయితే, ఇప్పుడు పైనాపిల్ జ్యూస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే హాని గురించి మనం తెలుసుకుందాం.
పైనాపిల్ లో ఉండే అధిక పొటాషియం వల్ల మూత్రపిండాలకు హానికరం. ఒకవేళ ఇప్పటికే ఏవైనా మూత్ర పిండాల సంబంధిత సమస్యలు ఉంటే పైనాపిల్ జ్యూస్ తాగకపోవడమే మంచిది. దీన్ని అధిక వినియోగం వల్ల మూత్రపిండాలపై అది అదనపు ఒత్తిడి వస్తుంది.
దీనివల్ల అలెర్జీ కూడా రావచ్చు. పైనాపిల్ లో ఉండే బ్రో లైన్ కు అలెర్జీ ఉండవచ్చు. ఇది దురద, ఎరుపు దద్దుర్లు, వాపు లేదా చర్మంపై తేలికపాటి చికాకు సమస్యలుకు కారణమవుతుంది
పైనాపిల్ లో బ్రోమేలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణ క్రియ కు సహాయపడుతుంది. కానీ దీని అధిక వినియోగం ఆమ్లత్వం, కడుపునొప్పి, విరోచనాలు, వికారం అంటి సమస్యలకు దారితీస్తుంది.
పైనాపిల్ లో సహజంగా ఆమ్లంగా ఉంటుంది. ఇది దంతాల ఎనామిల్ ను ప్రభావితం చేస్తుంది. దీనిని ఎక్కువగా తీసుకుంటే దంతాలు బలహీన పడతాయి. అంతేకాకుండా కావిటీస్ ప్రమాదం కూడా పెరుగుతుంది.
పైనాపిల్ జ్యూస్ ను ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు త్రాగకూడదు. ఎందుకంటే ఇందులో సహజ షుగర్ పుష్కలంగా ఉంటుంది. దీని అధిక పరిమాణంలో తీసుకుంటే అది రక్తంలో షుగర్ లెవెల్స్ ని పెంచుతుంది. కావున షుగర్ ఉన్నవారు దీనికి దూరం ఉండడమే మంచిది.
Pineapple Juice: ఫైనాపిల్ జ్యూస్ ని అధికంగా తాగుతున్నారా..? కలిగే నస్టాలివే..
సంబంధిత వార్తలు | RELATED ARTICLES