Lemon: వేసవి, వర్షాకాలంతో సంబంధం లేకుండా మన ఆహారాల్లో నిమ్మకాయలను వాడుతూ ఉంటాం. ఇవి నోటికి రుచిని ఇవ్వటమే కాకుండా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. కానీ, ఎక్కువ రోజులు నిమ్మకాయలు నిల్వ చేస్తే ఎండిపోవడం, రసం తగ్గడం తరచుగా చూస్తాం. ఇటువంటి పరిస్థితుల్లో నిమ్మకాయలను మళ్లీ కొనాల్సి వస్తుంది. దీంతో డబ్బులు కూడా వృధా అవుతాయి. అయితే నిమ్మకాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండి, రుచిని అందించాలంటే కొన్ని ప్రత్యేక నిలువ చిట్కాలను పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మార్కెట్లో లేదా ఇంటి ఆవరణలో చెట్టుకు లభించే నిమ్మకాయలు తాజాగా ఉండాలంటే వాటిని కట్ చేయకుండా ఉండాలి. నిమ్మకాయలను ఫ్రిజ్ లో నిల్వ చేస్తే అవి దాదాపు 2నుండి 3 వారాలపాటు తాజాగా ఉంటాయి.
ఒకవేళ సగం నిమ్మకాయ ఉంటే దానిని ముక్కలుగా కట్ చేసి గాలి వెళ్ళని కంటైనర్ లో ఉంచి ఫ్రిజ్లో పెట్టాలి. ఇలా పెట్టడం ద్వారా అవి ఎక్కువ రోజులు చెడిపోకుండా తాజాగా ఉంటాయి. అంతేకాకుండా అవసరమైనప్పుడు సులభంగా ఉపయోగించవచ్చు.
నిమ్మకాయలు ఎక్కువగా ఉంటే వాటి రసాన్ని తీసి శుభ్రమైన కంటైనర్ లో నింపి ఫ్రిజ్ లో పెట్టడం ఉత్తమం. నిమ్మరసాన్ని ఐస్ ట్రేలో ఉంచితే అవి ఐస్ క్యూబ్ లాగా మారుతాయి. దీంతో నిమ్మరసం అవసరమైనప్పుడు నిమ్మరస క్యూబ్ ను తీసి ఉపయోగించవచ్చు.
నిమ్మకాయ తాజాగా ఉండాలంటే ఒక గిన్నెలో నీటిని పోసి దానిలో నిమ్మకాయలను వేసి ఫ్రిజ్ లో పెట్టాలి. దీంతో నిమ్మకాయలు హైడ్రేట్ గా ఉంటాయి. అవి తొందరగా ఎండిపోవు కూడా. అయితే ప్రతి 2 నుండి 3 రోజులకు ఒకసారి నీటిని మారుస్తూ ఉండాలి. తద్వారా నిమ్మకాయలు ఎక్కువకాలం తాజాగా ఉంటాయి.
Lemon: నిమ్మకాయలు వారలు తరబడి తాజాగా ఉండాలంటే ఇలా చేయండి..
సంబంధిత వార్తలు | RELATED ARTICLES