Wednesday, January 14, 2026
Homeలైఫ్ స్టైల్Eating Peanuts: వేరుశెనగ తినడం వల్ల బరువు పెరుగుతారా లేదా తగ్గుతారా..?

Eating Peanuts: వేరుశెనగ తినడం వల్ల బరువు పెరుగుతారా లేదా తగ్గుతారా..?

Peanuts Lead To Weight Gain Or Loss: చలికాలం వచ్చిందంటే చాలు, చాలామంది వేడి వేడి పల్లీలు తింటుంటారు. వీటిని వివిధ మార్గాల్లో ఆహారంలో చేర్చుకుంటారు. అయితే, కొందరు వేరుశెనగ తినడం వల్ల శరీర బరువు పెరుగుతుందని భావిస్తారు. ఇక మరికొందరు ఇవి బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తాయని చెబుతుంటారు. కానీ, నిజం ఏమిటి? వేరుశెనగలో ఎన్ని కేలరీలు ఉంటాయి? అవి బరువును పెంచుతాయా లేదా తగ్గిస్తాయా? వీటిని ఏ వ్యక్తులు తినకూడదు? వంటి ఆసక్తికర విషయాల గురించి డాక్టర్ల మాటల్లోనే తెలుసుకుందాం.

- Advertisement -

ఢిల్లీలోని GTB హాస్పిటల్‌లో మాజీ డైటీషియన్ డాక్టర్ అనామిక గౌర్ ప్రకారం..వేరుశెనగ తినడం ద్వారా బరువు పెరుగుతారనేది ఒక అపోహ మాత్రమే. 100 గ్రాముల వేరుశెనగ తినడం వల్ల దాదాపు 560 కేలరీలు లభిస్తాయి. వీటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దాదాపు 100 గ్రాముల పల్లీలలో 26 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ వల్లనే వేరుశెనగలను సూపర్‌ఫుడ్ అని కూడా పిలుస్తారు. ఇందులో ఉండే అధిక ప్రోటీన్, శరీర బరువును నియంత్రిస్తుంది.

also read:Body Detoxification: శరీరంలో పేరుకుపోయిన మలినాల్ని తొలగించే పండ్లు..ఈరోజు నుంచే డైట్ లో చేర్చుకోండి..!

వేరుశెనగ తినడం వల్ల బరువు పెరుగుతారా లేదా తగ్గుతారా

వేరుశెనగలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది శరీర బరువు పెరగడాన్ని నిరోధిస్తుంది. వేరుశెనగలోని ప్రోటీన్ కంటెంట్ వాటి మొత్తం కేలరీలలో దాదాపు 25 శాతం ఉంటుంది. వీటిని తిన్నప్పుడు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. అతిగా తినకుండా నిరోధిస్తుంది. దీంతో బరువును అదుపులో ఉంచవచ్చు. వాటిలో ఫైబర్ కూడా ఉంటుంది. ఇది కడుపును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఏ రూపంలోనైనా వేరుశెనగలను తినడం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అయితే, వాటిని నెయ్యి లేదా నూనెలో వేయించకూడదు. ఎందుకంటే? ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. కాబట్టి ఉడకబెట్టిన లేదా డ్రై రోస్ట్ చేసిన వేరుశనగలు తినడం ఆరోగ్యానికి మంచిది.

పల్లీలను బెల్లంతో కలిపి

బెల్లం తో వేరుశెనగ తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే? బెల్లంలోని యాంటీఆక్సిడెంట్లు, వేరుశెనగలోని ప్రోటీన్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పల్లీలు ఎంత ఆరోగ్యకరమైనా రోజుకు 25 గ్రాముల కంటే ఎక్కువ వేరుశెనగ తినకూడదని గుర్తుంచుకోండి.

ఈ ఆరోగ్య సమస్యలు ఉంటె పల్లీలు తినకూడదు

  • మలబద్ధకం ఉన్నవారికి ఇబ్బంది
  • పల్లీలు అలెర్జీ ఉన్నవారు వీటిని ముట్టుకోకూడదు
  • తక్కువ బరువు ఉన్నవారు
  • అధిక రక్తపోటు, కిడ్నీ సమస్యతో బాధపడేవారు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News