ఎండలు మండిపోతున్న ఈ సమయంలోశరీరానికి చల్లదనం, శక్తి అందించేందుకు సహజమైన మార్గాలు ఎంతో ముఖ్యం. అటువంటి సమయాల్లో ఆరోగ్య ప్రయోజనాల పరంగా ప్రాధాన్యత పొందుతున్న పండు డ్రాగన్ ఫ్రూట్. ఆకర్షణీయమైన రంగుతో ఉండే ఈ పండు తింటే.. రుచితో పాటు శరీరానికి నూతన ఉత్సాహం రెండూ కలుగుతాయి. తాజా పరిశోధనలు, పోషకాహార నిపుణుల సూచనలు చూసినా ఈ పండును రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడమే ఉత్తమమని చెబుతున్నారు.
డ్రాగన్ ఫ్రూట్‌లో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఇతర సూక్ష్మ పోషకాలు చర్మానికి గ్లోని తిరిగి తీసుకొస్తాయి. వేసవి కాలంలో తరచూ కనిపించే డల్‌నెస్, ట్యాన్, చర్మ విసుక్కుపోవడం వంటి సమస్యలకు ఈ పండు సమర్థమైన పరిష్కారం. ప్రతిరోజూ ఈ పండు తీసుకోవడం ద్వారా చర్మం తాజాగా మెరిసేలా మారుతుంది. అదే సమయంలో నిద్రలేమి కారణంగా వచ్చే చర్మ కాంతి లోపాన్ని కూడా ఇది తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
జీర్ణాశయానికి మంచిది: వేసవి కాలంలో జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఎదురవుతుంటాయి. డ్రాగన్ ఫ్రూట్‌లో ఉండే ఫైబర్, సహజ ఎంజైమ్‌లు జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా రోజూ తీసుకుంటే పేగుల కదలికలు సజావుగా ఉండేలా చేస్తుంది.
శక్తికి రీఛార్జ్ ప్రతి బైట్‌లో ఎనర్జీ: శరీరానికి తక్షణ శక్తి కావాలంటే డ్రాగన్ ఫ్రూట్ ఉత్తమ ఎంపిక. ఇందులో ఉండే సహజ షుగర్స్,హైడ్రేట్స్ శరీరాన్ని వేగంగా ఎనర్జీతో నింపుతాయి. గ్లూకోజ్ లెవెల్స్‌ను సురక్షితంగా సమతుల్యం చేస్తూ, ఫిజికల్ యాక్టివిటీకి సహాయపడతాయి.
గుండెకు ఆరోగ్యం: ఇందులో ఉండే మంచికొవ్వులు (Healthy Fats), ఫైబర్ గుండెకు మిత్రులుగా మారతాయి. డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, మంచిది పెరిగేలా చేస్తుంది. దీర్ఘకాలికంగా గుండె సంబంధిత రోగాల రిస్క్‌ను తగ్గించే లక్షణాలున్నాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి.
గట్ హెల్త్‌కి గుడ్ న్యూస్: డ్రాగన్ ఫ్రూట్ ప్రీబయోటిక్ లక్షణాలు గట్‌లో ఉండే మంచిబ్యాక్టీరియాను పెంచుతాయి. ఇది హాజీర్ణతను మెరుగుపరచడమే కాకుండా, ఇమ్యూనిటీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎండాకాలంలో తరచూ ఎదురయ్యే మూడ్ స్వింగ్స్, ఒత్తిడిలాంటి సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
వేసవిలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన పండు: హైడ్రేషన్, శరీర శక్తి, చర్మ ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ — ఇలా అన్నింటికీ ఒకే సమాధానంగా మారుతుంది డ్రాగన్ ఫ్రూట్. జ్యూస్ రూపంలో లేదా పండును తొక్కతీసి నేరుగా తినడం ద్వారా ఉపయోగాలు పొందవచ్చు. వేసవి వేడి మీ శరీరాన్ని ఇబ్బంది పెట్టకూడదనుకుంటే… ఈ పండును మీ రోజు వారి ఆహారంలో చేర్చేయడం మంచిదని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.