Ghee Coffee Benefits: చాలామందికి ఉదయాన్నే టీ, కాఫీ తాగానిదే రోజు గడవదు. కొందరు టీ తాగితే, మరికొందరు కాఫీ తాగడానికి ఇష్టపడతారు. అయితే కాఫీలో నెయ్యి ని కలుపుకుని తాగుతారని మీకు తెలుసా..? కాఫీలో నెయ్యిని కలుపుకుని తాగితే శరీరానికి ఎంతో శక్తి వస్తుంది. అంతేకాకుండా.. ఇది బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. అయితే, ప్రతిరోజు మూడు నెలల పాటు కాఫీలో నెయ్యి కలుపుకుని తాగితే శరీరంపై ఇలాంటి ప్రభావం ఉంటుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కాఫీలో నెయ్యి కలుపుకుని తాగితే శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు చూద్దాం
నెయ్యిలో అనేక ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. కంజుగేటెడ్ లినో లెయిక్ యాసిడ్ (CLA) మొదలైనవి. ఇవి శరీరంలోని కొవ్వు పరిమాణాన్ని తగ్గించి బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. దీంతో పాటు నెయ్యిలో ఉండే షార్ట్- చైన్ ఫ్యాటీ యాసిడ్ బ్యూటీ రెట్ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది జీర్ణ క్రియను కూడా సులభతరం చేస్తుంది. నెయ్యితో కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. అయితే నాణ్యత గల నెయ్యిని తీసుకోవడం ముఖ్యం.
బరువు పెరగడం
నెయ్యిలో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో మంచి కొవ్వులు కూడా ఉంటాయి. దీనిని అధికంగా తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శరీరం అదనపు కేలరీలను కొవ్వుగా మార్చగలదు. ఇది ఊబకాయంతో పాటు అనేక వ్యాధులకు దారితీస్తుంది.
కాఫీలో నెయ్యిని కలుపుకుని తాగితే కాఫీ ఉండే కెఫిన్, నెయ్యి జీవక్రియను పెంచడానికి సహాయపడతాయి. అంతేకాకుండా ఆరోగ్యానికి ఎంతో శక్తి వస్తుంది. ఎంతో యాక్టివ్ గా కూడా ఉంటాం.
నెయ్యి కాఫీ ఎవరు తాగకూడదు?
1. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు.
2. జీర్ణ సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి.
3. బరువు తగ్గాలనుకునే వారు దీని తాగకపోవడమే మంచిది
4. ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు.