Saturday, November 15, 2025
HomeTop StoriesKidney Health: జాగ్రత్త..ఈ డ్రింక్స్​తో కిడ్నీలకు ముప్పు..

Kidney Health: జాగ్రత్త..ఈ డ్రింక్స్​తో కిడ్నీలకు ముప్పు..

Kidney Damage Drinks: శరీరంలో ముఖ్యమైన అవయవాలలో కిడ్నీలు ఒకటి. ఇవి రక్తాన్ని శుభ్రపరిచి, వ్యర్థ పదార్థాలను తొలగించి, శరీరంలో నీరు, ఖనిజాల సమతుల్యతను కాపాడుతాయి. అయితే, చాలామంది గుండె, ఊపిరితిత్తులు, లివర్ ఆరోగ్య విషయంలో తీసుకునే జాగ్రత్తలు, కిడ్నీల విషయానికి వచ్చే సరికి నిర్లక్ష్యం చేస్తుంటారు. ఫలితంగా కిడ్నీ సమస్యల సమస్యల బారీన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

ఈ క్రమంలో మూత్రపిండాలను జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా మనం ప్రతిరోజూ నోటికి రుచి కోసం తీసుకునే పానీయాలు కిడ్నీలను నెమ్మదిగా దెబ్బతీస్తాయని, అటువంటి వాటికి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి, అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

 

కూల్ డ్రింక్స్, సోడా: కూల్ డ్రింక్స్, సోడా ఫాస్పోరిక్ ఆమ్లం, చక్కెర, కెఫిన్‌లతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి మూత్రపిండాల్లో రాళ్లు, మూత్రపిండాల వైఫల్య ప్రమాదాన్ని పెంచుతాయి.

ఎనర్జీ డ్రింక్స్: ఇవి మనకు తాత్కాలికంగా శక్తిని పెంచినప్పటికీ, మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వీటిలో ఉండే అధిక స్థాయి కెఫిన్ వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇది మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగిస్తుంది.

ప్యాక్ చేసిన పండ్ల రసాలు: సహజ పండ్ల రసాలకు బదులుగా ఈ డ్రింక్స్ లో అదనపు షుగర్ కంటెంట్ ఉంటుంది. ఇది మూత్రపిండాలను ఓవర్‌లోడ్ చేస్తాయి.

అధిక కాఫీ వినియోగం: అధిక కెఫిన్ మూత్ర విసర్జనను పెంచడం ద్వారా శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. ఇది మూత్రపిండాలను ప్రభావితం చేస్తుంది.

ఆల్కహాల్: మద్యం సేవించడం వల్ల అధిక రక్తపోటు, కాలేయ వ్యాధి, కిడ్నీలు దెబ్బతింటాయి. ఆల్కహాల్ మూత్రపిండాల వడపోత సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది.

 

మూత్రపిండల వైఫల్యం ప్రారంభ సంకేతాలు

1. తరచుగా మూత్రవిసర్జన లేదా మూత్రంలో మార్పులు
2. ముఖం, చీలమండలు, పాదాల వాపు
3. ఆకలి లేకపోవడం, వాంతులు లేదా వికారం
4. నిరంతర అలసట
5. అధిక రక్తపోటు
6. ఏకాగ్రత పెట్టడంలో ఇబ్బంది
7. చర్మంపై దురద – పొడిబారడం
8. అధిక రక్తపోటు..
9.శ్వాస ఆడకపోవడం..

మూత్రపిండాలను దీర్ఘకాలికంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే కొబ్బరి నీరు, నిమ్మకాయ నీరు, హెర్బల్ టీ వంటి సహజమైన, హైడ్రేటింగ్ డ్రింక్స్ ను ఎంచుకోవాలి.

నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad