Homeలైఫ్ స్టైల్East-West Trend: ఈస్ట్–వెస్ట్ ట్రెండ్: వింటేజ్ ఫ్యాషన్‌కు కొత్త స్టైల్

East-West Trend: ఈస్ట్–వెస్ట్ ట్రెండ్: వింటేజ్ ఫ్యాషన్‌కు కొత్త స్టైల్

East West Fashion Trend: ఫ్యాషన్ రంగంలో కాలానికి అనుగుణంగా కొత్త కొత్త ట్రెండ్స్‌ పుట్టుకొస్తుంటాయి. ఎప్పుడు ఏదోక స్టైల్‌ ఫ్యాషన్ రంగాన్ని ఏలుతూ ఉంటుంది. ప్రస్తుతం అలాంటి హాట్ ట్రెండ్స్‌లో ఒకటే ఈ ‘ఈస్ట్–వెస్ట్ ఫ్యాషన్’. పాతకాలపు వింటేజ్ స్టైల్‌ను ఆధునిక టచ్‌తో మళ్లీ పరిచయం చేస్తూ ఈ ట్రెండ్ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటోంది.

- Advertisement -

1920ల ఫ్యాషన్‌కు మళ్లీ డిమాండ్
ఈస్ట్–వెస్ట్ ట్రెండ్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇది 1920ల నాటి ఫ్యాషన్ నుంచి ప్రేరణ పొందింది. ఆ కాలంలోని సింపుల్, ఎలిగెంట్ డిజైన్స్‌ను ఇప్పుడు మళ్లీ మోడర్న్ స్టైల్‌లో తీసుకొస్తున్నారు. స్ట్రైట్ కట్స్, స్లెండర్ లుక్స్ ఈ ట్రెండ్‌లో ముఖ్య ఆకర్షణలు. ఈ ట్రెండ్‌లో మినిమలిస్ట్ డిజైన్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. క్లీన్ లైన్స్, సింపుల్ స్ట్రక్చర్, ఓవర్ డిజైన్ లేకుండా స్టైలిష్‌గా కనిపించడం దీని ప్రత్యేకత. అందుకే ఇది క్లాసీ లుక్ ఇవ్వాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్‌గా మారుతోంది. ఈస్ట్–వెస్ట్ ఫ్యాషన్‌లో యాక్సెసరీస్ కీలక పాత్ర పోషిస్తాయి.

మినిమలిస్ట్ స్టైల్ హైలైట్
ముఖ్యంగా హ్యాండ్‌బ్యాగులు ఈ ట్రెండ్‌లో హైలైట్‌గా నిలుస్తున్నాయి. ఈస్ట్–వెస్ట్ బ్యాగులు ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో హాట్ కేక్స్‌లా అమ్ముడవుతున్నాయి. బోల్డ్ డిజైన్స్, స్ట్రక్చర్డ్ షేప్స్ వీటిని మరింత ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. కేవలం డ్రెస్సింగ్ స్టైల్ మాత్రమే కాదు, ఈస్ట్–వెస్ట్ ట్రెండ్ ఇంటీరియర్ డిజైన్‌లలో కూడా కనిపిస్తోంది. సింపుల్ డెకర్, క్లాసిక్ ఎలిమెంట్స్, మినిమల్ టచ్‌తో హోమ్ స్టైలింగ్‌లో కూడా ఈ ట్రెండ్ ప్రాచుర్యం పొందుతోంది. మొత్తానికి, ఈస్ట్–వెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్ పాతకాలపు వింటేజ్ స్టైల్‌ను కొత్తగా మలిచిన స్టైల్. సింపుల్‌గా ఉన్నా క్లాసీగా కనిపించాలని అనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఎంపిక. ఫ్యాషన్ ప్రపంచంలో మళ్లీ వింటేజ్ స్టైల్ హవా కొనసాగుతోందని ఈ ట్రెండ్ స్పష్టంగా చెబుతోంది.

Also Read: Gota Patti Hairstyle: గోటా పట్టీ హెయిర్ స్టైల్.. క్షణాల్లో ఫెస్టివ్ లుక్!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News