Saturday, November 15, 2025
Homeలైఫ్ స్టైల్Stress: స్ట్రెస్ తగ్గాలంటే.. ఈ ఫుడ్స్ తినండి..!

Stress: స్ట్రెస్ తగ్గాలంటే.. ఈ ఫుడ్స్ తినండి..!

Stress Foods: జీవనశైలి, ఆహారపు అలవాట్లు అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. ఇందులో ఒత్తిడి కూడా ఒకటి. దీని నివారించడం చాలా కష్టం. చేసే పని, వ్యక్తిగత జీవితం లేదా సంబంధాల కారణంగా ఒత్తిడి ఉంటుంది. ఎవరికైన కొంచెం ఒత్తిడి ఉంటె అది సాధారణం. కానీ ఈ ఒత్తిడి ఎక్కువ కాలం పాటు ఉంటె, అది అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. దీర్ఘకాలిక ఒత్తిడి కారణంగా, కార్టిసాల్ హార్మోన్, స్ట్రెస్ హార్మోన్ పెరగడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా అనేక వ్యాధులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రక్తపోటు పెరగడం, నిద్రలేమి, వాపు, మానసిక కల్లోలం, బరువు పెరగడం వంటి సమస్యలు సంభవించవచ్చు. అందువల్ల కార్టిసాల్ హార్మోన్ పెరుగుదల ఎంతో ప్రమాదకరం. అయితే, కొన్ని ఆహారాలను డైట్ లో చేర్చుకోవడం ద్వారా కార్టిసాల్ హార్మోన్‌ను నియంత్రించవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

 

డార్క్ చాక్లెట్

దాదాపు 70% కోకోతో కూడిన డార్క్ చాక్లెట్, ఒత్తిడిని తగ్గించడంలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది రుచిగా కూడా ఉంటుంది! ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనోల్స్, రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. మనసుకు విశ్రాంతినిస్తాయి. డార్క్ చాక్లెట్ సెరోటోనిన్ స్థాయిలను పెంచడం ద్వారా మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. కార్టిసాల్ ఉత్పత్తిని తగ్గించడంలో సహాయపడుతుంది.

కొవ్వు చేపలు

సాల్మన్, మాకేరెల్, సార్డిన్స్, ట్యూనా వంటి కొవ్వు చేపలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలకు అద్భుతమైన మూలం. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు వాపును తగ్గిస్తాయి. మెదడు ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సహిస్తాయి.అయితే ఈ కొవ్వు చేపలు తీసుకుంటే ఒమేగా-3 శరీరంలో కార్టిసాల్ స్థాయిల పెరుగుదలను నిరోధిస్తుంది.

also Read:Health: రాత్రి పడుకునే ముందు జాజికాయ తింటున్నారా..అయితే జరిగేది ఇదే..!

బ్లూబెర్రీస్

బ్లూబెర్రీస్ యాంటీఆక్సిడెంట్లకు శక్తివంతమైన వనరు. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఆక్సీకరణ ఒత్తిడి కారణంగా కార్టిసాల్ హార్మోన్ పెరుగుతుంది. విటమిన్ సి మరియు బ్లూబెర్రీస్‌లో ఉండే ఇతర ఫైటోన్యూట్రియెంట్లు ఒత్తిడిని తగ్గించి ఉపశమనం కలిగిస్తాయి.

వాల్‌నట్స్

వాల్‌నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. మెగ్నీషియం అనేది శరీరాన్ని ప్రశాంతపరచడంలో సహాయపడుతుంది. మంచి నిద్రను పొందడంలో సహాయపడే ఖనిజం కూడా! ఇది కార్టిసాల్ హార్మోన్‌ను నియంత్రిస్తుంది.

పెరుగు

పెరుగు ప్రోబయోటిక్స్ అద్భుతమైన మూలం. ప్రోబయోటిక్స్ మంచి బ్యాక్టీరియా. ఇవి గట్ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. ఆరోగ్యకరమైన గట్ కార్టిసాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతాయి.

 

నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad