Diabetes Effects: రక్తంలో బ్లడ్ షుగర్ అధికంగా ఉండటం వల్ల శరీరంలోని కొన్ని అవయవాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. డయాబెటిస్ వల్ల మరిన్ని సమస్యలు తలెత్త అవకాశం ఉంటుంది. అయితే ఏ అవయవాలు ఎఫెక్ట్ అవుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
గుండె
డయాబెటిస్ వల్ల రక్తనాళాలు దెబ్బతింటాయి. గుండెకు చేటు జరుగుతుంది. బీపీ పెరగడం, గుండె వ్యాధుల రిస్క్ పెరిగిపోతుంది. హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా అధికమవుతుంది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు గట్టిపడడం లేదా మూసుకుపోవడం వల్ల సమస్యలు వస్తాయి. రక్త ప్రసరణ సరిగా లేక వివిధ అవయవాలకు ఆక్సిజన్ తగినంత అందదు.
కళ్లు
డయాబెటిస్ వల్ల కళ్ల వెనుక ఉన్న చిన్న రక్తనాళాలు దెబ్బతిని చూపు తగ్గిపోవచ్చు. కొందరికి కంటి చూపు పోవచ్చు. డయాబెటిస్ రెటినోపతి, డయాబెటిక్ మాక్యులర్ ఎడెమా కంటి శుక్లాలు, గ్లూకోమా వంటి కంటి సమస్యలు వస్తాయి. ఇవన్నీ కూడా కంటి చూపును మందగించేలా చేస్తాయి.
also read:Electric Scooters: సింగిల్ చార్జితో వంద కిలోమీటర్లకు పైగా రేంజ్..ఇదిగో టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్స్
మూత్రపిండాలు
మూత్రపిండాలపై డయాబెటిస్ ఎఫెక్ట్ చూపిస్తుంది. డయాబెటిక్ నెఫ్రోపతి అనే వ్యాధి వచ్చే రిస్క్ అధికం. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీలోని సూక్ష్మ రక్తనాళాలు దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది. ఇది వాటి పనితీరుపై దుష్ప్రభావాన్ని చూపిస్తాయి.
పాదాలు
రక్త ప్రసరణ తగ్గి నరాలు దెబ్బ తినడం వల్ల గాయాలు త్వరగా నయం కావు. ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం పెరుగుతుంది. కొన్నిసార్లు పాదం తీసేయాల్సి పరిస్థితి రావచ్చు. డయాబెటిక్ న్యూరోపతి వంటి సమస్యలు వస్తే కాళ్లు, పాదాలు, చేతుల్లో నొప్పి, తిమ్మిరి వంటివి వస్తాయి. దీనివల్ల స్పర్మ శక్తి కూడా తగ్గిపోతుంది.
నరాలు
బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే నరాలు దెబ్బ తినే ఆస్కారం ఉంటుంది. డయాబెటిక్ న్యూరోపతి అని పిలిచే సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువ. కాళ్లు, పాదాల్లోని నరాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి. జీర్ణ క్రియ సమస్యలు మానసిక ఆందోళన వంటివి కలుగుతాయి.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.

