Egg Coffee Trend:సోషల్ మీడియాలో రోజుకో కొత్త ఫుడ్ ట్రెండ్ వైరల్ అవుతూనే ఉంది. తాజాగా కాఫీ ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తున్న ట్రెండ్ ‘ఎగ్ కాఫీ‘. ఇది సాధారణ కాఫీ కాదు.. వియాత్నంలో ప్రసిద్ధి చెందిన ప్రత్యేక కాఫీ ఇది. ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. వినడానికి కొంచెం విచిత్రంగా అనిపించినా ఇది తాగిన వాళ్లు మాత్రం పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు.
క్రీమీ టెక్స్చర్, రిచ్ టేస్ట్ ఈ కాఫీ ప్రత్యేకత
ఈ ఎగ్ కాఫీ తయారికి గుడ్డు పచ్చసొన, కండెన్స్డ్ మిల్క్, చక్కెర పదార్థాలను ప్రధానంగా వాడుతారు. ఈ మూడింటిని ఒక పాత్రలో వేసి నురుగు వచ్చేవరకు బాగా కలపాలి. ఆ తర్వాత స్ట్రాంగ్ హాట్ కాఫీపై ఈ క్రీమీ మిశ్రమాన్ని పోయాలి. ఇలా తయారయ్యే ఎగ్ కాఫీకి పై భాగంలో ఫోమ్ లాంటి లేయర్ ఏర్పడుతుంది. దీన్ని నెమ్మదిగా కలుపుతూ తాగితే ప్రత్యేకమైన రుచి అనుభవం లభిస్తుంది.
ఈ కాఫీ ప్రత్యేకత ఏమిటంటే.. గుడ్డు వాసన ఎక్కువగా తెలియదు. కానీ టెక్స్చర్ మాత్రం చాలా క్రీమీగా రిచ్‌గా ఉంటుంది. రెగ్యులర్ కాఫీతో పోలిస్తే ఇందులో ప్రొటీన్, హెల్తీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. అందుకే కొత్త రుచులను ట్రై చేయాలనుకునే వారు, కాఫీ లవర్స్ దీన్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు.
ఆరోగ్యపరమైన జాగ్రత్తలు
అయితే ఎగ్ కాఫీ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పచ్చి గుడ్లలో సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది. ఇది గట్ సమస్యలు, అజీర్ణం వంటి ఇబ్బందులకు దారి తీస్తుంది. ముఖ్యంగా సెన్సిటివ్ స్టమక్ ఉన్నవారు లేదా ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు దీన్ని తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మీరు కొత్త కాఫీ ఫ్లేవర్స్ ట్రై చేయడంలో ఆసక్తి ఉన్నవారైతే ఎగ్ కాఫీ ఒక మంచి ఎక్స్‌పీరియెన్స్ కావచ్చు. కానీ హైజీన్ ఎగ్ నాణ్యత మీ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే దీన్ని ప్రయత్నించడం మంచిది.

