Homeలైఫ్ స్టైల్Self Discovery: షెల్ఫ్ డిస్కవరీ ట్రెండ్.. ప్రయాణానికి కొత్త అర్థం

Self Discovery: షెల్ఫ్ డిస్కవరీ ట్రెండ్.. ప్రయాణానికి కొత్త అర్థం

Self Discovery Trends: ప్రస్తుతం ట్రావెల్ ప్రపంచంలో ఒక ఆసక్తికరమైన ట్రెండ్ వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. అదే ‘షెల్ఫ్ డిస్కవరీ ట్రెండ్‘. కొత్త ఊరు లేదా టూరిస్టు ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడి ప్రసిద్ధ ప్రదేశాలకే పరిమితం కాకుండా స్థానిక సూపర్ మార్కెట్లు, కూరగాయల మార్కెట్లు, పళ్ల బజార్లు వంటి ప్రదేశాల్లో తిరుగుతూ ఆ ప్రాంత జీవనశైలిని అర్థం చేసుకోవడమే ఈ ట్రెండ్ ప్రత్యేకత.

- Advertisement -

స్థానిక సంస్కృతిపై అవగాహన
ఇప్పటి యువత ఏం చేసిన అందులో ప్రత్యేకత ఉండాలని కోరుకుంటుంది. అందుకే సాధారణ సైట్‌సీయింగ్ కంటే స్థానిక జీవన విధానాన్ని దగ్గరగా తెలుసుకునే విధంగా ఈ ట్రెండ్‌ను అనుసరిస్తున్నారు. షాపుల్లో షెల్ఫ్‌లను పరిశీలిస్తూ అక్కడ అమ్మే వస్తువులను గమనిస్తూ తిరగటం ఇప్పుడు ఒక ట్రావెల్ యాక్టివిటీగా మారింది. షెల్ఫ్ డిస్కవరీ ద్వారా ఒక ప్రాంతానికి చెందిన అనేక విషయాలు సులభంగా అర్థమవుతాయి. అక్కడి ప్రజలు ఏమి తింటారు, ఎలాంటి పదార్థాలతో వంటలు చేస్తారు, ఏ పండ్లు, కూరగాయలు ఎక్కువగా లభిస్తాయి, ఏవి స్థానికంగా ప్రసిద్ధి పొందిన చిరుతిళ్లు వంటివి ఒకే చోట మనకు తెలిసిపోతుంది. ఇది కేవలం షాపింగ్ కాదు ఒక రకంగా ఆ ప్రాంత సంస్కృతి, జీవనశైలి, వాతావరణాన్ని అర్థం చేసుకునే సరదా ప్రయాణం. ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా కొత్త అనుభూతిని ఇస్తుంది.

ఎందుకు ట్రెండ్ అవుతోంది?
ప్రస్తుతం ట్రావెల్‌లో “ఎక్స్‌పీరియెన్స్”కి ఎక్కువ ప్రాధాన్యం పెరిగింది. ప్రజలు కేవలం ఫోటోలు తీసుకోవడం కాకుండా, ఆ ప్రాంతాన్ని లోతుగా అనుభవించాలని కోరుకుంటున్నారు. షెల్ఫ్ డిస్కవరీ ఈ అవసరాన్ని తీర్చే సింపుల్ కానీ ఎఫెక్టివ్ మార్గంగా మారింది. ఉదాహరణకు, బ్యాంకాంక్ వెళ్లే పర్యాటకులు అక్కడి లోకల్ మార్కెట్లలో గంటల తరబడి గడుపుతుంటారు. ఆ మార్కెట్ల సందడి, వివిధ రకాల ఆహార పదార్థాలు, స్థానిక ఉత్పత్తులన్ని కలిసి ఆ నగరాన్ని మరింత దగ్గరగా అనుభవించేందుకు సహాయపడతాయి. షెల్ఫ్ డిస్కవరీ ట్రెండ్ ద్వారా ప్రయాణం మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఇది కేవలం చూసే ప్రయాణం కాదు, తెలుసుకునే ప్రయాణం. కొత్త ఊరిని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే అక్కడి మార్కెట్లు ఒక ఉత్తమ గమ్యం అని చెప్పవచ్చు. ఈసారి మీరు ట్రిప్ ప్లాన్ చేస్తే.. కాస్త భిన్నంగా ఆలోచించండి. లోకల్ షాపులను సందర్శిస్తూ ‘షెల్ఫ్ డిస్కవరీ‘ అనుభవాన్ని పొందండి. మీ ప్రయాణం మరింత గుర్తుండిపోయేలా చేసుకోండి!

Also Read: Watermelon Coffee: సమ్మర్ స్పెషల్.. వాటర్మెలన్ కాఫీ ట్రెండ్..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News