Saturday, November 15, 2025
Homeలైఫ్ స్టైల్Womens Health: మహిళలు.. అదే పనిగా నైటీలు ధరిస్తున్నారా? అయితే డేంజర్లో పడ్డట్లే..!

Womens Health: మహిళలు.. అదే పనిగా నైటీలు ధరిస్తున్నారా? అయితే డేంజర్లో పడ్డట్లే..!

Health And Wellness: సౌలభ్యం కోసం మహిళలు రాత్రి పగలు తేడా లేకుండా నైటీలు ధరిస్తున్నారు. అయితే ఇది ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాలిస్టర్ వంటి కృత్రిమ వస్త్రాలను ధరించడంతో శారీరక ఆకృతికి హానికరమని అంటున్నారు. పరిశుభ్రత పాటించకపోవడం వలన అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. అయితే నైటీలతో ఆరోగ్య సమస్యలతో పాటుగా కొన్ని లాభాలు సైతం ఉన్నాయి. నైటీలతో కలిగే లాభనష్టాలను తెలుసుకుందాం!

- Advertisement -

 సౌకర్యవంతమైన నిద్రకు నైటీలు ఉత్తమం: సౌలభ్యం విషయంలో నైటీల వాడకం ఎంతో ఉపయోగకరమని వస్త్ర నిపుణులు చెబుతున్నారు. సున్నితమైన వస్త్రాలతో తయారైన నైటీలు శరీరానికి విశ్రాంతినివ్వడమే కాకుండా.. సౌకర్యవంతమైన నిద్రకు తోడ్పడతాయని పేర్కొన్నారు. నైటీలు సాధారణంగా కాటన్ వంటి సున్నితమైన వస్త్రాలతో తయారవుతాయి. ఇవి చర్మంపై మృదువుగా ఉండటంతో పాటుగా.. శరీరానికి సరైన గాలి తగిలేలా చేస్తాయి. రాత్రి వేళల్లో నైటీలు ధరించడం వలన నిద్ర నాణ్యత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. నైటీలు వివిధ రకాల డిజైన్లలో లభిస్తాయి. దీంతో ప్రతి ఒక్కరూ తమ అభిరుచికి తగ్గట్టుగా నైటీలను ఎంచుకోవచ్చని పేర్కొన్నారు.

Also Read:https://teluguprabha.net/lifestyle/the-secret-qualities-of-guys-to-attracting-women/

నైటీలతో ఆరోగ్య సమస్యలు:

శరీరాకృతిపై ప్రభావం: చీరలు ధరించడం వలన శరీరం బిగుతుగా ఉంటుంది. కొన్ని భాగాలలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది. కానీ నైటీలు చాలా వదులుగా ఉండటం వలన శరీరంలోని వివిధ భాగాల్లో కొవ్వు సులభంగా పెరిగిపోతుంది. దీంతో శరీర ఆకృతి మారిపోతుంది.

వస్త్రధారణలో మార్పు: ఒకప్పుడు కేవలం రాత్రిపూట మాత్రమే ధరించే నైటీలను ఇప్పుడు పగలు కూడా ధరించడం వలన వ్యక్తిగత పరిశుభ్రత దెబ్బతింటుంది.

చర్మ సమస్యలు: నైటీలు సాధారణంగా తేలికైన మరియు వదులైన వస్త్రంతో తయారవుతాయి. అయితే నిరంతరం వీటిని ధరించడం వల్ల చర్మానికి సరైన గాలి తగలదు. ముఖ్యంగా వేడి వాతావరణంలో చెమట పేరుకుపోయి ఫంగల్ ఇన్ఫెక్షన్లు, చర్మ వ్యాధులకు దారితీస్తుంది.

Also Read: https://teluguprabha.net/lifestyle/how-to-manage-depression-and-stay-fit-after-a-breakup/

ఆరోగ్యం, పరిశుభ్రత: నైటీలు కేవలం రాత్రిపూట ధరించడానికి మాత్రమే రూపొందించబడ్డాయి. వీటిని ధరించి వంట చేయడం, ఇతర ఇంటి పనులు చేయడం వలన నైటీపై మురికి, బ్యాక్టీరియా పేరుకుపోతాయి. దీంతో ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సైతం ప్రమాదకరమని నిపుణులు సూచిస్తున్నారు.

సామాజికంగా, వ్యక్తిగతంగా: అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు నైటీలో ఉండటం ఇబ్బందికరంగా ఉంటుంది. అంతేకాకుండా సామాజికంగా కూడా నైటీలు ధరించి బయటకి వెళ్లడం సరైనది కాదని నిపుణులు పేర్కొన్నారు. ఆరోగ్యాన్ని శారీరక ఆకృతిని కాపాడుకోవడానికి పగటిపూట నైటీలకు బదులుగా సౌకర్యవంతమైన ఇతర దుస్తులు ధరించడం ఉత్తమం. నైటీలను కేవలం రాత్రి పూట మాత్రమే ఉపయోగించడం మంచిదని సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad