Homeలైఫ్ స్టైల్Relationships : వెన్నపూస పూసి.. వెన్నుపోటు పొడిచే వారితో ముప్పు

Relationships : వెన్నపూస పూసి.. వెన్నుపోటు పొడిచే వారితో ముప్పు

Toxic relationships boundaries : స్నేహం, బంధుత్వం ముసుగులో మన వెన్నంటే ఉంటూ.. ముఖం ముందు నవ్వుతూ, వెనుక గోతులు తవ్వే మోసపూరిత వ్యక్తులు సమాజంలో తరచూ కనిపిస్తుంటారు. ఇలాంటి ‘టాక్సిక్’ (Toxic) బంధాలు మన మానసిక ప్రశాంతతను దెబ్బతీయడమే కాకుండా జీవితాన్ని అంధకారంలోకి నెట్టేస్తాయి. అసలు ఈ నకిలీ వ్యక్తులను ఇట్టే పసిగట్టడం ఎలా? వారి విషపూరిత ఆలోచనల నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి? ఆ వివరాలు ఈ కథనంలో పరిశీలిద్దాం!

- Advertisement -

నకిలీ వ్యక్తుల లక్షణాలు – వారిని దూరం పెట్టే మార్గాలు:
ద్వంద్వ స్వభావం: వీరు ముందొకలా, వెనకొకలా ప్రవర్తిస్తారు. మన విజయాలను చూసి ఓర్వలేక ఈర్ష్య పడతారు; నలుగురిలో మనల్ని చులకన చేసి మాట్లాడటమే పనిగా పెట్టుకుంటారు.

స్వార్థపూరిత ప్రవర్తన: కష్టకాలంలో ఎప్పుడూ అందుబాటులో ఉండరు. కానీ తమకు అవసరమైనప్పుడు మాత్రం ఎలాంటి సంకోచం లేకుండా సహాయం కోరతారు.

వ్యక్తిగత విషయాల్లో జోక్యం: మన కెరీర్ లేదా కుటుంబ విషయాలపై పనికిరాని సలహాలిస్తూ, భార్యాభర్తలు లేదా బంధువుల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు.

దూరంగా ఉండటం మేలు: ఇలాంటి వారి అభిప్రాయాలను పూర్తిగా విస్మరించాలి. వ్యక్తిగత విషయాలు పంచుకోకుండా తగినంత దూరం పాటించడం, అవసరమైతే నిర్మొహమాటంగా వారిని పక్కన పెట్టడం మనశ్శాంతికి ముఖ్యం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News