Homeలైఫ్ స్టైల్Fashion Formula: 2X2 ఫ్యాషన్ ఫార్ములా ట్రెండ్

Fashion Formula: 2X2 ఫ్యాషన్ ఫార్ములా ట్రెండ్

ఫ్యాషన్ ఫార్ములా ట్రెండ్స్ ను పాటించేవారి సంఖ్య పెరుగుతోంది. ప్రొఫెషనల్స్, స్టైలిస్టులు చెప్పే చిన్న ట్రిక్స్ తో కామన్ మ్యాన్ కూడా డ్రస్సింగ్ ను సమూలంగా మార్చుకుంటున్నారు. 2 బై 2 ఫ్యాషన్ ఫార్ములా అంటే స్టైలిష్, సౌకర్యవంతంగా కనిపించేందుకు ఉపయోగపడే డ్రెస్సింగ్ పద్ధతి. స్టైలిష్, ట్రెండీ, ఫార్మల్ గా ఉండే వస్త్రాలు-యాక్సెసరీస్ ని డైలీ వేర్, కంఫర్ట్ గా ఉండేవాటితో జోడించటమే ఈ ఫ్యాషన్ ఫార్ములా.

- Advertisement -

స్వెట్టర్లు వాడేస్తున్నారు..

బ్లేజర్ లేదా జాకెట్, నగలు, హీల్స్ వంటివాటికి టీ-షర్ట్, జీన్స్, స్నీకర్స్ యాడ్ చేస్తే వచ్చే లుక్ సూపర్ గా ఉంటుంది. అంటే పర్ఫెక్ట్ లుక్ ఇచ్చే ఫార్ములా ఇదేనని చాలామంది ఈ ఫార్ములా ఫాలో అవుతున్నారు. ఇందులో భాగంగా స్వెట్టర్స్ కూడా వేసేసుకుంటున్నారు. అంటే కొత్తగా ఏం కొనకుండా ఉన్నవాటితోనే మంచి కాంబినేషన్స్ తయారుచేసుకోవటం అన్నమాట. సింపుల్ గా ఉంటూనే మోడర్న్ స్టైల్ స్టేట్మెంట్ ఇచ్చేందుకు ఇలాంటి ఫార్ములాలు పనికొస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News