Acidity Remedies: అనారోగ్యకరమైన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల చాలామంది అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందులో ఒకటి ఎసిడిటీ. ఈరోజుల్లో ఎసిడిటీ సాధారణ సమస్యగా మారింది. గుండెల్లో మంట, పుల్లని తేన్పులు, తల బరువుగా ఉండటం లేదా ఛాతీ నొప్పి వంటి తరచుగా వచ్చే లక్షణాలు ఎసిడిటీ పెరుగుదలకు సంకేతాలు. చాలా మంది ఈ సమస్యను తగ్గించుకోవడం కోసం రకరకాల మందులు వేసుకుంటారు. కానీ, ఇది తాత్కాలికం మాత్రమే. మళ్లీ ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు ఎసిడిటీ వస్తుంది.
అయితే, మందులతో కాకుండా సహజంగానే ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందాలనుకుంటే కొన్ని నివారణలు పాటించడం ఉత్తమం. ఇవి కడుపును చల్లబరిచి, తక్షణ ఫలితాలను చూపుతాయి. ఇప్పుడు ఎసిడిటీని తొలగించడంలో సహాయపడే కొన్ని ఇంటి చిట్కాల గురించి వివరంగా తెలుసుకుందాం.
చల్లని పాలు: ఎసిడిటీ నుండి ఉపశమనం పొందడానికి చల్లని పాలు తాగడం సులభమైన, అత్యంత ప్రభావవంతమైన మార్గం. పాలు కడుపు ఎసిడిటీని తగ్గిస్తుంది. దీని తాగడం గుండెల్లో మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే, ఎసిడిటీ తగ్గించడానికి తాగే పాలల్లో చక్కెర లేదా సుగంధ ద్రవ్యాలు జోడించకుండా పాలు సాదాగా, చల్లగా ఉండేలా చూసుకోవాలి. తరచుగా ప్రతిరోజూ పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల ఎసిడిటీ ప్రమాదం తగ్గుతుంది.
సోంపు, చక్కెర: సోంపులోని యాంటీ-యాసిడ్ లక్షణాలు ఉంటాయి. ఇవి కడుపును ఎసిడిటీ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. గ్యాస్‌ను తగ్గిస్తాయి. ఒక టీస్పూన్ సోంపును కొద్దిగా చక్కెర తో కలిపి నెమ్మదిగా నమలాలి. ఇది కడుపు తేలికగా అనిపించడంలో సహాయపడుతుంది. దీనింక్రమం తప్పకుండ తింటే జీర్ణక్రియ సైతం మెరుగుపడుతుంది.
కొబ్బరి నీరు: కొబ్బరి నీరు శరీరం pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. గుండెల్లో మంటను తగ్గిస్తుంది. ఉదయం లేదా మధ్యాహ్నం ఖాళీ కడుపుతో ప్రతిరోజూ ఒక గ్లాసు కొబ్బరి నీరు తాగడం వల్ల ఎసిడిటీ తగ్గుతుంది. ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా సహజ హైడ్రేషన్‌ను అందిస్తుంది.
తులసి ఆకులు: తులసి ఆకులు ఎసిడిటీ నియంత్రించే గ్యాస్ట్రిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. కొన్ని తులసి ఆకులను నమలడం లేదా నీటిలో మరిగించి త్రాగడం వల్ల ఎసిడిటీ నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఇది కడుపును చల్లబరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ప్రతి ఉదయం 4-5 ఆకులను నమలడం కడుపుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
అల్లం రసం: ప్రతిఒక్కరి ఇంట్లో ఉండే అల్లం ఎసిడిటీ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీని రసం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపు ఎసిడిటీని నియంత్రిస్తుంది. అర టీస్పూన్ అల్లం రసాన్ని కొద్దిగా నీటితో కలిపి తాగడం వల్ల గుండెల్లో మంట తగ్గుతుంది. కావాలనుకుంటే, పలు లేకుండా అల్లం టీ కూడా తాగవచ్చు. ఇది ఎసిడిటీ, అజీర్ణం రెండింటికీ ప్రభావవంతంగా ఉంటుంది.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


