Hair Care: జుట్టు రాలే సమస్య ఈ రోజుల్లో ప్రతి ఒక్కరినీ వేధిస్తుంది. జుట్టు రాలడం అనేది నీడలా వెంటాడే సమస్య. దీనికి జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, కాలుష్యం వంటి అనేక కారణాలు ఈ సమస్యలకు దారితీస్తాయి. చాలామంది జుట్టు రాలడాన్ని నివారించేందుకు మార్కెట్లో లభించే అనే ఖరీదైన ప్రొడక్ట్స్ కూడా వాడుతారు. కానీ అవి ఆశించినంత ప్రయోజనాలు అందించవు. అయితే, ఉదయాన్నే కొన్ని మంచి అలవాట్లను అలవర్చుకుంటే, జుట్టు రాలే సమస్యలను నివారించవచ్చు. అవేంటో ఒకసారి చూద్దాం.
నిద్రలేచిన వెంటనే నీరు తాగడం: ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక గ్లాసు గోరువెచ్చని లేదా సాదా నీరు తాగాలి. ఇది జుట్టు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ అలవాటు జుట్టు కుదుళ్లను హైడ్రేట్ చేస్తుంది. అంతేకాదు పొడిబారడాన్ని కూడా తగ్గిస్తుంది. నీరు తాగడం వల్ల తలకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఎప్పుడైతే జుట్టు హైడ్రేటెడ్‌గా ఉంటుందో అప్పుడు జుట్టు రాలడం తగ్గుతుంది.
also read:Health Tips: జాగ్రత్త..ఆరోగ్యాన్ని దెబ్బతీసే అలవాట్లు ఇవే..
పోషకమైన అల్పాహారం: ఉదయం తీసుకునే ఆహారం శరీరానికి మాత్రమే కాకుండా జుట్టుకు కూడా పోషణ అందిస్తుంది. కావున, ఆరోగ్యకరమైన జుట్టుకు దోహదపడే అల్పాహారం తీసుకోవడానికి ట్రై చేయాలి. జుట్టు ఆరోగ్యానికి ప్రోటీన్లు ఎంతో సహాయపడుతాయి. కాబట్టి, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. జున్ను, సోయా, పెరుగు, గింజలు, ప్రోటీన్ షేక్స్ లేదా ప్రోటీన్ స్మూతీలను వంటివి తీసుకోవాలి.
వ్యాయామం: వ్యాయామం శరీరానికి ఎంత ప్రయోజనం చేకూరుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వ్యాయామం జుట్టుకు కూడా అంతే ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ అలవాటు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది జుట్టు కుదుళ్లకు ఎక్కువ ఆక్సిజన్, పోషకాలను అందిస్తుంది. వ్యాయామం జుట్టు రాలడానికి ఒక సాధారణ కారణమైన ఒత్తిడిని తగ్గిస్తుంది. జుట్టు ఆరోగ్యం కోసం రోజులో కనీసం ఉదయం 15 నిమిషాలు నడవాలి లేదా యోగా చేయాలి.
జుట్టు సంరక్షణ: ఆరోగ్యకరమైన జుట్టును నిర్వహించాలంటే, దానిని సరిగ్గా చూసుకోవాలి. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే? జుట్టుకు ఆయిల్ మసాజ్ చేయడం. ఇది జుట్టు పొడవుగా, మందంగా పెరగడానికి సహాయపడుతుంది. ఈ అలవాటు జుట్టును శుభ్రంగా ఉంచి, చుండ్రు వంటి సమస్యలను నివారిస్తుంది. జుట్టు ఆరోగ్యం కోసం వారానికి కనీసం రెండుసార్లు జుట్టును క్లీన్ గా వాష్ చేయాలి. అయితే, వేడి నీరు జుట్టుకు హాని కలిగిస్తుందని గుర్తించుకోండి.


