Saturday, November 15, 2025
Homeలైఫ్ స్టైల్Intestinal Worms: కడుపులో నులిపురుగులతో ఇబ్బంది ఉందా..?ఈ సింపుల్ చిట్కాలు పాటించండి!

Intestinal Worms: కడుపులో నులిపురుగులతో ఇబ్బంది ఉందా..?ఈ సింపుల్ చిట్కాలు పాటించండి!

Intestinal Worms in Children: కడుపులో నులిపురుగులు అనేవి చాలా కామన్. సాధారణంగా పిల్లల కడుపులోనూ నులిపురుగులు చేరుతూ ఉంటాయి. నులిపురుగులు ఆరోగ్యానికి ప్రమాదకరం కాకపోయినప్పటికీ, దీంతో పిల్లలు నీరశించిపోతూ ఉంటారు. నులిపురుగుల వలన రక్తహీనత, తరచూ ఆకలి దప్పులు, తలనొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే, ఈ సింపుల్ చిట్కాలతో ఈ నులిపురుగుల సమస్యను వదిలించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

- Advertisement -

వెల్లుల్లి రెబ్బలు: పిల్లలకు ప్రతిరోజూ రెండు లేదా మూడు పచ్చి వెల్లుల్లి రెబ్బలను తినిపించడం వల్ల సమస్య పరిష్కారమవుతుంది. వెల్లుల్లిలోని ఉండే సల్ఫర్ సమ్మేళనాలు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కడుపులోని పురుగులను నాశనం చేస్తాయి.

గుమ్మడికాయ గింజలు: గుమ్మడికాయ గింజల్లో ఉండే కుకుర్బిటాసిన్ అనే సమ్మేళనం జీర్ణవ్యవస్థలోకి ప్రవేశించే పురుగులను తొలగించడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. పిల్లలు ప్రతిరోజూ తినే ఆహారంలో గుమ్మడికాయ గింజలను చేర్చడం మంచిది. ఇవి వారి ఎదుగుదల లో కూడా సహాయపడుతుంది.

బొప్పాయి పండు: బొప్పాయిలో ఉండే పాపైన్ అనే ఎంజైమ్ కడుపుతో పాటు జీర్ణవ్యవస్థను కూడా పూర్తిగా శుభ్రపరుస్తుంది. దీని తినడం వల్ల నులిపురుగులను తొలగించడంలో ఔషధంలా పనిచేస్తుంది. పండిన బొప్పాయి పండ్ల ముక్కలను పిల్లలకు క్రమం తప్పకుండా తినిపించడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది.

వాల్‌నట్స్‌: వాల్‌నట్స్‌లో యాంటీ-పరాసిటిక్ లక్షణాలు ఉంటాయి. కావున వీటిని రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయం పిల్లలకు తినిపిస్తే, సమస్య నాలుగు రోజుల్లో నులిపురుగులు సమస్య పరిష్కారమవుతుంది.

అల్లం రసం: ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ఒక చెంచా అల్లం రసం తాగడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు: ఫైబర్ అధికంగా ఉండే ఆహారం పిల్లలకు ఇవ్వడం వల్ల నులిపురుగులను బయటకు పంపవచ్చు. తృణధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, బీన్స్, క్యారెట్లు, బీట్‌రూట్, పసుపు, బెల్లం, కొబ్బరి, పెరుగును ఆహారంలో చేర్చడం వల్ల నులిపురుగుల సమస్య వెంటనే తీరుతుంది.

వేడి నీరు: ఉదయం ఖాళీ కడుపుతో వేడి నీటిని తాగడం వలన కూడా నులిపురుగులు చనిపోతాయంట.

ఈ ఇంటి నివారణలు క్రమంగా పాటిస్తే కడుపు నులిపురుగుల సమస్యను సహజంగా నివారించవచ్చు. అయితే ఈ సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

 

నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad