Anti Aging: ఈ రోజుల్లో మెరిసే చర్మాన్ని ఎవరు కోరుకోరు చెప్పండి. ఇందుకోసం చాలామంది మార్కెట్లో లభించే ఖరీదైన సౌందర్య ఉత్పత్తులు వాడుతుంటారు. అయినా ఈ ప్రొడక్ట్స్ ఆశించినంత ఫలితాలు అందించవు. అయితే కొన్ని అలవాట్లను మార్చుకోవడం వల్ల యవ్వనంగా, అందమైన రూపాన్ని కాపాడుకోవచ్చు. ఈ అలవాట్లు ఆచరించడానికి కూడా ఎంతో సులభంగా ఉంటాయి. ఈ నివారణలు ఆరోగ్యకరమైన చర్మం, జుట్టును ప్రోత్సహించడమే కాకుండా ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి కూడా సహాయపడతాయి. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
నిమ్మకాయ నీరు: నిమ్మకాయ నీరు శరీరానికి సహజమైన డీటాక్స్ డ్రింక్ గా పనిచేస్తుంది. గోరువెచ్చని నీటితో నిమ్మకాయ రసం కలిపి తాగడం వల్ల విష పదార్థాలు బయటకు వెళ్తాయి. తరచుగా దీని తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. నిమ్మకాయలలోని విటమిన్ సి మెరిసే చర్మాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ముఖంపై ముడతలను సైతం నివారిస్తుంది.
also read:Back Pain: ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే..వెన్నునొప్పికి 5 నిమిషాల్లో ఉపశమనం!
జుట్టుకు నూనె రాయడం: జుట్టు అందాన్ని రేటింపు చేస్తుంది. వారానికి రెండుసార్లు జుట్టుకు కొబ్బరి, బాదం లేదా ఆవ నూనెను అప్లై చేయాలి. ఇది వెంట్రుకలను పొడిబారకుండా నిరోధిస్తుంది. అదనంగా, నెత్తిని ఆరోగ్యంగా ఉంచుతుంది. తరచుగా జుట్టుకు నూనె పూయడం వల్ల రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టుకు సహజమైన మెరుపును అందిస్తుంది.
సూపర్ ఫుడ్స్: సహజ యాంటీ ఏజింగ్ ఏజెంట్లుగా పనిచేసే అనేక ఆహారాలు ఉన్నాయి.ఇందులో పసుపు ఒకటి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. అలాగే ఆమ్లా లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మెరిసే చర్మాన్ని ప్రోత్సహిస్తుంది. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. క్రమం తప్పకుండ బాదం, వాల్‌నట్స్ తీసుకుంటే చర్మాన్ని మృదువుగా చేస్తాయి.
వ్యాయామం: యోగా, తేలికపాటి వ్యాయామం శరీరాన్ని ఫిట్‌గా ఉంచడానికి కాకుండా రక్త ప్రసరణ చర్మ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతిరోజూ 20–30 నిమిషాల వాకింగ్, సూర్య నమస్కారం లేదా తేలికపాటి వ్యాయామాలు రోజంతా చురుకుగా ఉంచుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తుంది.
మంచి నిద్ర: మంచి నిద్ర చర్మ అందం చికిత్స లాంటిది. ప్రతిరోజూ దాదాపు 7-8 గంటలు నిద్ర పోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నార. సరైన నిద్ర ముఖం పై నల్లటి వలయాలను నివారిస్తుంది. చర్మ అందానికి పడుకునే ముందు పసుపు లేదా ఏలకుల పాలు తాగాలి. అలాగే, ఫోన్‌కు దూరంగా ఉండేలా చూసుకోవాలి.


