Fitness Tips: నేటి బిజీ లైఫ్ వల్ల చాలామంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం పూర్తిగా మానేశారు. అనారోగ్యకరమైన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండటానికి తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేస్తుంటారు. అయితే, మన శరీరం ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలంటే మంచి ఆహారంతో పాటు వ్యాయామం కూడా ఎంతో ముఖ్యం. ఇప్పుడు చెప్పే కొన్ని అలవాట్లను మన రోజు వారి జీవితంలో భాగం చేసుకుంటే ఫిట్ గా ఉండొచ్చు. అవేంటో తెలుసుకుందాం.
చాలామందికి నిద్రలేచిన తర్వాత నీరు త్రాగే అలవాటు ఉండదు. కానీ ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఫలితంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరంలోని విష పదార్థాలు సులభంగా బయటికి వెళ్తాయి. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం లేదా తేనె కలుపుకుంటే ఆరోగ్యానికి ఇంకా మంచిది.
జాబ్, ఇతర కారణాల దృష్ట్యా చాలామంది వ్యాయామం కోసం జిమ్ కు వెళ్లేంత సమయం ఉండదు. అలాంటప్పుడు ఇంట్లోనే రోజు ఒక అరగంట పాటు యోగ, వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇలా ప్రతిరోజు ఒక అరగంట పాటు వ్యాయామం చేస్తే అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
also read:Health Department :మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా… 1623 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!
అనేక ఆరోగ్య సమస్యలకు చక్కెర కలిగిన ఆహార పదార్థాలు, పానీయాలే ముఖ్య కారణం. బరువు తగ్గడానికి, ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండడానికి చక్కెరతో కూడిన ఆహార పదార్థాలను తీసుకోవడం మానుకోవాలి. దీనికి బదులుగా బెల్లంతో చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కూడా!
నోటికి రుచిగా ఉందని అతిగా ఆహారం తినకూడదు. శరీర అవసరాల మేరకు మాత్రం తింటే సరిపోతుంది. తీసుకునే ఆహారంలో పండ్లు, తాజా కూరగాయలు, ఫ్రూట్ సలాడ్లు ఉండేటట్లు చూసుకోవాలి.
ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం అరగంట పాటు వేగంగా నడవాలి. దీంతో బరువు తగ్గడమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. అంతేకాకుండా, కచ్చితంగా ప్రతిరోజు 8 గంటలపాటు నిద్రపోవాలి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది.


