Saturday, November 15, 2025
Homeలైఫ్ స్టైల్Weight Loss: ఇంటి దగ్గర ఈ టిప్స్ పాటిస్తే చాలు.. బరువు ఇట్టే తగ్గుతారు..

Weight Loss: ఇంటి దగ్గర ఈ టిప్స్ పాటిస్తే చాలు.. బరువు ఇట్టే తగ్గుతారు..

Weight Loss Tips: ఈరోజుల్లో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. దీనికి నేటి జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం కారణాలు. బరువు తగ్గడానికి కొంతమంది వాకింగ్ చేస్తే, మరికొందరు జిమ్ కు వెళ్తారు. అయినా కూడా ఆశించినంత ఫలితాలు లభించవు. ఈ క్రమంలో ఇంటి దగ్గరే కొన్ని టిప్స్ పాటిస్తే బరువు తగ్గొచ్చని తెలుసా? ఈ సింపుల్ చిట్కాలు బరువు తగ్గడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఇవి కొవ్వును కరిగించడమే కాకుండా శరీరాన్ని లోపల నుండి చురుకుగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.

- Advertisement -

గోరువెచ్చని నిమ్మకాయ నీరు: ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నిమ్మకాయ నీరు త్రాగడం బరువు తగ్గడానికి సులభమైన, అత్యంత ప్రభావవంతమైన మార్గం. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని నిర్విషీకరణ చేస్తాయి. అంతేకాదు జీవక్రియను వేగవంతం చేస్తాయి. కావాలనుకుంటే నిమ్మకాయ నీరుకు ఒక టీస్పూన్ తేనెను కూడా జోడించవచ్చు. ఇది తక్షణ శక్తిని అందించి, కొవ్వును కరిగిస్తుంది.

మెంతి గింజలు: ఉదయం ఖాళీ కడుపుతో రాత్రిపూట నానబెట్టిన మెంతి నీరు తాగితే ఇట్టే బరువు తగ్గొచ్చు. కావల్సితే నీటిలో నానబెట్టిన మెంతి గింజలను కూడా నమలవచ్చు. దీని వినియోగం శరీరం జీవక్రియ వేగవంతం చేస్తుంది. అంతేకాదు, ఆకలిని నియంత్రిస్తుంది. మెంతి గింజలలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి సహజంగా కొవ్వును కరిగిస్తాయి.

also read:Health Tips: ఈ కూరగాయలు ఫ్రిజ్‌లో పెడితే..రోగాలను ఫ్రీగా తెచ్చుకున్నట్లే!

దాల్చిన చెక్క, తేనె: ఈ డ్రింక్ బరువు తగ్గడానికి ఎంతో అద్భుతంగా పని చేస్తుంది. ఇందుకోసం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, ఒక టీస్పూన్ తేనె వేయాలి. బాగా మిక్స్ చేసి తాగాలి. ఉదయం ఈ డ్రింక్ తాగడం వల్ల కొవ్వు త్వరగా కరుగుతుంది. దాల్చిన చెక్క రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచుతుంది. తేనె శరీరానికి శక్తిని అందిస్తుంది. ఈ మిశ్రమం ఆకలిని కూడా నియంత్రిస్తుంది. దీంతో పదే పదే తినే అలవాటును నివారించవచ్చు.

అధిక ఫైబర్ ఆహారలు: అధిక ఫైబర్ కంటెంట్ ఆహారాలు ఓట్స్, చిక్‌పీస్, సలాడ్‌లు, పండ్లు, మొలకెత్తిన ధాన్యాలు వంటివి డైట్ లో ఉండేలా చూసుకోవాలి. ఫైబర్ కడుపు నిండిన భావన కలిగిస్తుంది. ఫలితంగా పదే పదే తినే అలవాటును నివారిస్తుంది. బరువు తగ్గడానికి ఇది అత్యంత సహజమైన, స్థిరమైన మార్గం. ఇది మీ శరీర ఆకృతిని మెరుగుపరచడమే కాకుండా, చర్మాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

వ్యాయామలు: బరువు తగ్గడానికి శారీరక శ్రమ అవసరం. ప్రతిరోజూ 30 నిమిషాల చురుకైన నడక, యోగా లేదా డాన్స్ వంటి సాధారణ కార్యకలాపాలు శరీరాన్ని చురుకుగా ఉంచుతాయి. ఇవి కేలరీలను బర్న్ చేస్తాయి. వీటిని అలవాటు చేసుకుంటే బిజీ లైఫ్ లో ఎంత బిజీగా ఉన్నా బరువు క్రమంగా నియంత్రణలోకి వస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad