Sunday, November 16, 2025
Homeలైఫ్ స్టైల్Eye Health: కంటి ఆరోగ్యం కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

Eye Health: కంటి ఆరోగ్యం కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

Tips For Eye Health: మన శరీరంలోని ముఖ్యమైన భాగాలలో కళ్లు ఒకటి. పొద్దున లేచినప్పటి నుంచి, రాత్రి నిద్రపోయే వరకు కంటి పని నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో కంటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ కంటి ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి. కంటి వైద్యుడిని సందర్శించడం, క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం తో పాటు మన కళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి చేయగలిగే కొన్ని రోజువారీ విషయాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

ఆకుపచ్చ కూరగాయలు, క్యారెట్లు

కంటి ఆరోగ్యానికి మేలు చేసే ఆకుపచ్చ కూరగాయలు, క్యారెట్ లను డైట్ లో చేర్చుకోవడం ఎంతో మంచిది. ఫలితంగా వీటిలో ఉండే అంశాలు, యాంటీ ఆక్సిడెంట్లు కళ్ళకు సహజ రక్షణ కవచంగా పనిచేస్తాయి. అంతేకాకుండా ఇవి సూర్యకాంతి, కాలుష్యం వల్ల కలిగే నష్టం నుండి కళ్లను రక్షించడంతోపాటు దృష్టిని మెరుగుపరుస్తుంది. కావున ఈ ఆహారాలను ప్రతి రోజు తీసుకోవడం కంటి ఆరోగ్యానికి ఎంతో మంచిది.

Also Read: Health: భోజనం చేసిన తర్వాత చేయకూడని పనులు ఇవే.. చేశారంటే అంతే సంగతులు!

కంప్యూటర్ స్క్రీన్ నుండి కొంచెం దూరంగా ఉండటం

వర్క్ లో భాగంగా కంప్యూటర్ ను ఎక్కువగా ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే ఇది కళ్ళకు ఎక్కువగా హాన్ని కలిగిస్తుంది. కంప్యూటర్ స్క్రీన్ నుండి వెలువడే లైట్ కళ్ళలో ఒత్తిడిని పెంచుతుంది. దీని కారణంగా కళ్ళు అలిసిపోతాయి. అయితే దీనిని నివారించడానికి కంప్యూటర్ ఉపయోగిస్తున్నప్పుడు ప్రతి 20 నిమిషాలకు కాస్త రెస్ట్ తీసుకోవాలి. లేదంటే ప్రతి 20 నిమిషాల తర్వాత 20 అడుగుల దూరంలో ఉన్న దేనినైనా 20 సెకండ్ల పాటు చూడాలి. ఇది కళ్ళను రిలాక్స్ గా చేస్తుంది.

సన్ గ్లాసెస్ ధరించడం

బలమైన సూర్యకాంతి కారణంగా కళ్ళలో చికాకు, వాపు వంటి సమస్యలు సంభవిస్తాయి. కావున సన్ గ్లాసెస్ ధరించడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది సూర్యుని హానికరమైన కిరణాలనుండి కళ్ళను రక్షిస్తుంది. రిలాక్స్ గా ఉంచుతుంది కూడా! ఈ అలవాటు కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో సహాయపడుతుంది.

తగినంత నిద్ర

తగినంత నిద్ర లేకపోతే కళ్ళు అలసిపోయినట్లు అనిపిస్తాయి. దీంతో నొప్పి లేదా వాపు వంటి సమస్యలు వస్తాయి. కావున ప్రతిరోజు 7- 8 గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. ఇది జ్ఞాపకశక్తిని పెంచుతుంది. అంతేకాకుండా రోజంతా శక్తివంతంగా ఉండవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad