Blood Pressure Foods: ఇటీవల కాలంలో అధిక రక్త రక్తపోటు సాధారణ సమస్యగా మారిపోయింది. ఇది చాలామందిని ప్రభావితం చేస్తోంది. అధిక రక్తపోటును నియంత్రించకుంటే గుండె జబ్బులు, పక్షవాతం, మూత్రపిండాల వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. సాధారణంగా దీని నియంత్రించడానికి మందులు ఉపయోగిస్తారు. కానీ కొన్ని ఆహారాలు ఈ సమస్యను సహజంగా అధిగమించడంలో సహాయపడతాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రక్తపోటు స్థాయిని తగ్గించవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అరటి
అరటి పండు పొటాషియం మంచి మూలం. ఇది శరీరంలో ఉప్పు ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. దీంతో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజు అరటిపండు తినడం వల్ల శరీరానికి శక్తి మాత్రమే కాకుండా రక్తపోటును సమ్మతుల్యంగా ఉంచుతుంది.
Also Read:Weight Loss: సులభంగా బరువు తగ్గాలంటే.. ఉదయాన్నే ఈ డ్రింక్స్ తాగండి..
బీట్ రూట్
బీట్ రూట్ రక్తనాళాలను వెడల్పు చేయడం ద్వారా రక్త ప్రవాహాన్ని
మెరుగుపరిచే అంశాలను కలిగి ఉంటుంది. ఇందులో ఉండే అనేక అంశాలు గుండె ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. దీనిని క్రమం తప్పకుండా తినడం వల్ల రక్తపు అదుపులో ఉండడమే కాకుండా శరీరానికి తగినంత శక్తి అందుతుంది.
ఓట్స్
ఉడ్చిలో ఉండే ఫైబర్ శరీరంలో చెడుకుల స్టాండ్ తగ్గించడంలో సహాయపడుతుంది.దీంతోపాటు ఓట్స్లో గుండె జబ్బులను నివారించడంలో సహాయపడే అంశాలు కూడా ఉంటాయి. అల్పాహారంలో ఓట్స్ తీసుకోవడం వల్ల రోజంతా శక్తి లభిస్తుంది.
వెల్లుల్లి
అందరి వంటింట్లో ఉండే కామన్ ఆహార పదార్థం వెల్లుల్లి. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడే ప్రత్యేక మూలకం కలిగి ఉంటుంది. ఇందులో ఉండే షోద నిరోధక లక్షణాలు గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా. రోజు ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలు నమ్మడం ద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
ఆకుపచ్చ కూరగాయలు
పాలకూర, బ్రోకలీ వంటి ఆకుపచ్చ కూరగాయలలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అది కరెక్ట్ ఓటును నియంత్రించడంలో సహాయపడుతాయి. వీటిలో ఉండే ఫైబర్ జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాదు శరీరంలో ఉండే విషపూరిత అంశాలను సైతం తొలగిస్తుంది.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


