Sunday, November 16, 2025
Homeలైఫ్ స్టైల్Belly Fat: రోజూ ఈ 3 తిన్నారంటే..కొండలా ఉన్న పొట్ట కూడా ఇట్టే కరిగిపోతుంది!

Belly Fat: రోజూ ఈ 3 తిన్నారంటే..కొండలా ఉన్న పొట్ట కూడా ఇట్టే కరిగిపోతుంది!

Belly Fat Vs Healthy Food: శరీరంలో కొవ్వు పెరిగినప్పుడు, అది ఎక్కువగా పొట్ట చుట్టూ పేరుకుపోతుంది. ఈ బెల్లీ ఫ్యాట్ అంతర్గతంగా అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. గుండె సంబంధిత రోగాలు, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలకు ఇది ఒక ప్రధాన కారణం. అందుకే, బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించుకోవడం అనివార్యం. ఈ విషయంలో ప్రజల్లో జాగ్రత్త, అవగాహన రోజు రోజుకీ పెరుగుతోంది. ఫిట్‌గా ఉండాలనే లక్ష్యంతో చాలామంది జీవనశైలి మారుస్తున్నారు.

- Advertisement -

వైద్యుల సలహా ప్రకారం, సరైన ఆహారం, సరైన నిద్ర, ఒత్తిడి తగ్గించడం, వర్కౌట్‌లు వంటివి అనుసరిస్తే బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించవచ్చు. అయితే, అంతేకాదు, కొన్ని ఇంటి చిట్కాలతోనూ మంచి ఫలితాలు పొందొచ్చు. మూడు ముఖ్యమైన ఆహార పదార్థాలు ఇప్పుడు బెల్లీ తగ్గించాలనుకునేవారికి ఎంతో ఉపయోగపడతాయి.

వెల్లుల్లి..

వెల్లుల్లి…. ఇది మన వంటగదిలో తరచూ కనిపించే సాధారణమైనదే అయినా, దాని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణమైనవి. వెల్లుల్లిలో ఉండే ప్రత్యేకమైన రసాయనాలు శరీరంలోని కొవ్వు ని కరిగిస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో రెండు వెల్లుల్లి రెబ్బలు నమిలితే శరీరం థర్మోజెనిసిస్ అనే ప్రక్రియ ద్వారా కొవ్వును శక్తిగా మార్చే ప్రయత్నం చేస్తుంది. అయితే ముందుగా వెల్లుల్లిని కొంచెం కోసి 5 నిమిషాలు బయట ఉంచితే ఇందులో ఉండే అల్లిసిన్ అనే సమ్మేళనం మరింత చురుకుగా పనిచేస్తుంది.

యాపిల్ సైడర్ వెనిగర్..

దీని తరువాత రెండో శక్తివంతమైన పదార్థం యాపిల్ సైడర్ వెనిగర్. ఇది కూడా ఇంట్లో తేలికగా ఉపయోగించదగినదే. ఇందులో ఉండే అసిటిక్ యాసిడ్ శరీరంలోని కొవ్వు ని కరిగించడంలో కీలకంగా పనిచేస్తుంది. ప్రతిరోజూ ఉదయాన్నే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ యాపిల్ వెనిగర్ కలిపి తాగితే ఆకలి నియంత్రణలో ఉంటుంది. అంతేకాదు, ఇది బ్లడ్ షుగర్ లెవల్స్‌ని బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది. దీని వలన బెల్లీ ఫ్యాట్ తగ్గే అవకాశాలు పెరుగుతాయి.

మెంతులు…

మెంతులు… ఇవి సాధారణంగా మన ఇంట్లో ఉండే ధాన్యాల్లో ఒకటి. మెంతుల్లో ఉండే కరిగే ఫైబర్, కొన్ని విశిష్టమైన జీవ రసాయనాలు శరీరానికి రెండు రకాలుగా సహాయపడతాయి. ఇవి జీర్ణక్రియ వేగాన్ని నియంత్రిస్తాయి, ఆకలిని తగ్గిస్తాయి. దీని వలన అధిక ఆహారం తీసుకునే అలవాటు తగ్గుతుంది. రాత్రిపూట ఒక స్పూన్ మెంతులు నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగితే బెల్లీ ఫ్యాట్ తగ్గడంలో సహాయపడుతుంది. అంతేకాక, ఇది చక్కెర స్థాయిలను కూడా సమతుల్యం చేస్తుంది.

ఇవి కాకుండా, ఈ మూడు ఫుడ్స్‌ను ఉపయోగించేటప్పుడు కొన్ని ముఖ్యమైన అంశాలను గుర్తుంచుకోవాలి. ఒకేసారి అన్నీ కాకుండా, మీకు అందుబాటులో ఉన్నదాన్ని మాత్రమే ప్రారంభించాలి. అలాగే, ఇవేవీ ఔషధాలు కాదు కాబట్టి వెంటనే ఫలితం చూపుతాయని భావించకూడదు. నియమితమైన జీవనశైలిని అనుసరించడం, పోషకాహారాన్ని తీసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ కొనసాగించడం ద్వారా మాత్రమే దీర్ఘకాలిక ఫలితాలు లభిస్తాయి.

Also Read: https://teluguprabha.net/gallery/excess-turmeric-intake-may-cause-kidney-stones-and-bleeding-issues/

ప్రస్తుతం చాలా మంది బరువు తగ్గడాన్ని ఫ్యాషన్‌గా చూస్తున్నా, నిజానికి ఇది ఆరోగ్య పరంగా ఒక అవసరం. పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వు కేవలం శరీర ఆకారాన్ని మాత్రమే కాకుండా, శరీరంలోని అంతర్గత అవయవాల పనితీరుపైనా ప్రభావం చూపుతుంది. శరీరాన్ని శక్తివంతంగా ఉంచుకోవాలంటే, ఆకలి నియంత్రణ, మంచి జీర్ణక్రియ, మరియు వ్యాయామం అన్నీ సమతుల్యంగా ఉండాలి.

ఇక న్యూట్రిషనిస్ట్ సూచించిన ఈ మూడు ఫుడ్స్ సహజమైనవి, సులభంగా లభ్యమయ్యేవి. ఇవి ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ, ఇవి మీ సాధారణ ఆహారపు అలవాట్లలో భాగంగా మాత్రమే ఉపయోగపడతాయి. వీటిని ఆశ్రయించి ఇతర ఆరోగ్యపరమైన చర్యలను విస్మరించకూడదు.

Also Read: https://teluguprabha.net/health-fitness/bitter-gourd-can-be-harmful-for-some-people-says-experts/

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad