Fruits Immunity: ప్రతి ఒక్కరూ వర్షాకాలం ఆహ్లాదకరంగా భావిస్తారు. కానీ, ఈ సీజన్ లో ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్ లో వ్యాధులు ఎక్కువగా సంభవిస్తాయి. కావున అందరూ ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్త వహించాలి. సహజంగా వాతావరణం మారినప్పుడు వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే, ఇప్పటికే బిపి, అలెర్జీ వంటి ఏదైనా ఇతర వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారు ఈ సీజన్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలంలో సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. అయితే ఈ సీజన్ లో రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే ఈ క్రింద పేర్కొన్న పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. వాటిని క్రమం తప్పకుండా తీసుకుంటే వ్యాధుల బారిన పడకుండా ఉంటాం.
ఆపిల్
వర్షాకాలంలో ప్రతిరోజు ఒక యాపిల్ తినాలి. దీని వినియోగం రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇందులో ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
బొప్పాయి
బొప్పాయి పండు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఈ పండులో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణ క్రియ కు ఎంతో సహాయపడుతుంది. ఈ పండులో ఉండే ఫైబర్ అనేక కడుపు సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.
నేరేడు పండ్లు
నేరేడు పండ్లు ఈ సీజన్ సులభంగా దొరుకుతాయి. వీటిని తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. అంతేకాకుండా కేలరీల కంటెంట్ తగ్గుతుంది. నేరేడు పండ్ల లో పొటాషియం, విటమిన్లు అధికంగా ఉంటాయి. దీంతో వర్షాకాలంలో వీటి వినియోగం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వైరల్ వ్యాధులు దరిచేరవు.
పియర్
పియర్ లో విటమిన్ సి, కె అధికంగా ఉంటాయి. ఇవి వ్యాధులతో పోరాడడానికి సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రభావవంతంగా ఉండే ఈ పండును ఆయుర్వేదంలో అమృత పండుగ పరిగణిస్తారు.
పిచ్
పిచ్ లో పెద్ద మొత్తంలో కెరోటిన్, విటమిన్ సి ఉంటాయి. దీని కారణంగా ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎంతో సహాయపడుతుంది. ఈ సీజన్ లో ఈ పండును తీసుకుంటే శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
Immunity: వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే పండ్లు..
సంబంధిత వార్తలు | RELATED ARTICLES