Gas Stove Cleaning Tips: వంట చేసేటప్పుడు తరచుగా గ్యాస్ స్టవ్ పై నూనె, మసాలాలు, ఆహార పదార్థాల అవశేషాలు పడుతాయి. ఇవి స్టవ్ బర్నర్ల పై జిడ్డుగా, నల్లగా తయారవుతుంటాయి. ఈ మరకలు అంత సులభంగా పోవు. పైగా మెరుపును తగ్గిస్తాయి. గ్యాస్ స్టవ్ శుభ్రంగా ఉంచకపోతే, కీటకాలు వంటగదిలోకి చొరబడటమే కాకుండా, అనేక ఆనారోగ్య సమస్యలను కలిగిస్తాయి. అందుకే గ్యాస్ స్టవ్ ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ముఖ్యం. చాలామంది ఈ మరకలను తొలగించడానికి మార్కెట్లో లభించే ఖరీదైన, రసాయనాలతో కూడిన క్లీనర్లను వాడుతుంటారు. అయితే ఈ సులభమైన చిట్కాలు అనుసరించి కూడా గ్యాస్ స్టవ్ ను శుభ్రంగా ఉంచవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
also read:Diabetes Diet Idli Dosa: డయాబెటిస్ రోగులు ఇడ్లీ-దోస తినకూడదా?.. మీ సందేహానికి సమాధానమిదే..!
నిమ్మకాయ, వెనిగర్
గ్యాస్ స్టవ్ ను శుభ్రంగా ఉంచేందుకు ఒక కప్పు నీటిని పాన్‌లో పోసి వేడి చేయండి. నీరు కాస్త వేడి అయినా తర్వాత నీటిలో నిమ్మకాయను పిండాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ మిశ్రమానికి రెండు టీస్పూన్ల వెనిగర్ జోడించాలి. అనంతరం ఈ ద్రావణంతో గ్యాస్ స్టవ్‌ను పూర్తిగా శుభ్రం చేయవచ్చు. దీంతో స్టవ్ పై ఉన్న జిడ్డు, నల్లటి మచ్చలు తొలగిపోతాయి. మెరుగైన ఫలితాల కోసం, ఈ మిశ్రమానికి కొద్దిగా డిష్‌వాషింగ్ డిటర్జెంట్‌ను కూడా ఉపయోగించవచ్చు.
బేకింగ్ సోడా, వెనిగర్
శుభ్రమైన, పొడి వస్త్రంతో కూడా గ్యాస్ స్టవ్‌ను క్లీన్ చేయవచ్చు. దీంతో నిమిషాల్లో స్టవ్ పై ఉన్న మురికి, ఆహార పదార్థాల అవశేషాలు తొలగిపోతాయి. స్టవ్ శుభ్రంగా ఉంటుంది. ఒకవేళ స్టవ్ పై నూనె, జిడ్డు అలానే ఉంటె బేకింగ్ సోడా, వెనిగర్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఈ క్లీనింగ్ టిప్ కోసం మొదటగా బర్నర్ తొలగించాలి. ఇప్పుడు, ఒక గిన్నెలో బేకింగ్ సోడా, వెనిగర్ తీసుకోవాలి. వీటిని పేస్ట్ లాగా అయ్యేవరకు బాగా కలపాలి. అనంతరం ఈ పేస్ట్‌ను గ్యాస్ స్టవ్‌పై అప్లై చేసి, దాదాపు 15 నిమిషాల పాటు అలానే ఉంచాలి. తర్వాత స్టవ్ ను ఏదైనా స్క్రబ్బర్ లేదా బ్రష్‌తో క్లీన్ చేయాలి. దీంతో స్టవ్ శుభ్రపడుతుంది.


