Tattoo Engagement Rings: ఒకప్పుడు ఎంగేజ్మెంట్ అంటే డైమండ్ రింగ్, గోల్డ్ లేదా ప్లాటినం బ్యాండ్స్ తప్పనిసరి అనుకునే వారు. రింగ్ ఎంత ఖరీదైనదో, ఎంత అరుదైనదో అంత గొప్పగా భావించేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. కొత్త తరం తమ భావాలను వ్యక్తపరిచే విధానంలో కొత్త ప్రయోగాలు చేస్తోంది. అందులో భాగంగానే “ఎంగేజ్మెంట్ టాటూ రింగ్” ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉంగరం బదులు టాటూ ఎందుకు?
ఈ ట్రెండ్‌లో జంటలు తమ ఉంగరం వేలిపై శాశ్వతంగా ఉండేలా టాటూ వేయించుకుంటున్నారు. సాధారణంగా రింగ్ ఆకారంలో లేదా ప్రత్యేక సింబల్స్, తేదీలు, పేర్లతో ఈ టాటూలను డిజైన్ చేస్తున్నారు. ఇది కేవలం ఫ్యాషన్ మాత్రమే కాదు, “పర్మినెంట్ కమిట్‌మెంట్” అనే భావనను సూచిస్తుందని జెన్ జీ కపుల్స్ భావిస్తున్నారు. అందుకే దీన్ని “ఎప్పటికీ ఉండే రింగ్”గా కూడా చెబుతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్
ఇన్స్ట్రామ్, టిక్ టాక్ వంటి ప్లాట్‌ఫార్మ్‌లలో ఈ ట్రెండ్ విపరీతంగా పాపులర్ అవుతోంది. కొత్తగా నిశ్చితార్థం చేసుకున్న జంటలు తమ టాటూ రింగ్స్‌ను చూపిస్తూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. దీంతో ఈ ట్రెండ్ మరింత వేగంగా విస్తరిస్తోంది. టాటూ రింగ్స్ మరో ప్రత్యేకత ఏమిటంటే, ఇవి సాధారణంగా డైమండ్ లేదా గోల్డ్ రింగ్స్‌తో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతో ఉంటాయి. అందువల్ల బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్‌గా కూడా ఇది మారింది. అయితే, దీని వెనుక ఉన్న భావన మాత్రం చాలా విలువైనది. ప్రేమ, నమ్మకం, శాశ్వత బంధం. ఈ మూడు విషయాలను సూచించే ప్రతీకగా ఈ టాటూ రింగ్స్ నిలుస్తున్నాయి.
జాగ్రత్తలు కూడా అవసరం
ఈ ట్రెండ్ ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. టాటూ ఒకసారి వేయించుకుంటే అది శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించడం అవసరం. అలాగే, హైజీన్ పాటించే ప్రొఫెషనల్ టాటూ ఆర్టిస్టుల వద్ద మాత్రమే టాటూ వేయించుకోవాలి. ఎంగేజ్మెంట్ టాటూ రింగ్ ట్రెండ్, కొత్త తరం భావాలను ప్రతిబింబించే ఒక క్రియేటివ్ ఆలోచన. ఖరీదైన రింగ్స్ కన్నా భావానికి విలువ ఇస్తున్న జెన్ జీ ఈ ట్రెండ్‌ను మరింత ముందుకు తీసుకెళ్తోంది. ప్రేమను వ్యక్తపరచడానికి మార్గాలు మారినా, ఆ భావం మాత్రం ఎప్పటికీ మారదు.

