Homeలైఫ్ స్టైల్Geriatric Parkour: వృద్ధుల్లో కొత్త ఉత్సాహం నింపుతున్న 'జెరియాట్రిక్ పార్కర్' ట్రెండ్

Geriatric Parkour: వృద్ధుల్లో కొత్త ఉత్సాహం నింపుతున్న ‘జెరియాట్రిక్ పార్కర్’ ట్రెండ్

Geriatric Parkour: సింగపూర్‌లో విభిన్నమైన ఫిట్నెస్ ట్రెండ్ పెద్ద ఎత్తున ప్రాచుర్యం పొందుతోంది. ముఖ్యంగా ఇది సీనియర్ సిటిజెన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఎందుకంటే ఈ ఫిట్‌నెస్‌ ప్రధానంగా వృద్ధులను కోసమే ప్రత్యేకంగా మొదలైన వెల్నెస్ పద్ధతి కావడం విశేషం. రిటైర్ అయినవారు తమ రోజువారీ జీవితంలో కొత్త ఉత్సాహాన్ని పొందేందుకు ఈ ట్రెండ్‌ను అనుసరిస్తున్నారు.

- Advertisement -

సీనియర్లకు ప్రత్యేకం
‘జెరియాట్రిక్ పార్కర్’గా పిలుస్తున్న ఈ ఫిట్నెస్ విధానం సాధారణ వ్యాయామాలకు భిన్నంగా ఉంటుంది. ఇందులో వృద్ధులు చెట్లెక్కడం, గోడలు ఎక్కడం, చిన్నచిన్న దూరాలు దూకడం, జంపింగ్ చేయడం, పరిగెత్తడం వంటి శారీరక వ్యాయమాలు చేస్తారు. సాధారణంగా ఇవి యువత ఎక్కువగా చేస్తుంది. కానీ, ఈ జెరియాట్రిక్ పార్కర్ వల్ల దీనిని వృద్ధులు కూడా ఫాలో అవుతున్నారు. దీనివల్ల వారిలో ధైర్యంతో, ఆత్మవిశ్వాసం మరింత పెంపోందుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ట్రెండ్‌ను అనుసరిస్తున్న వారు తమ శరీరంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.

వృద్ధుల్లో కొత్త ఉత్సాహం
ముఖ్యంగా మోకాళ్ల నొప్పులు, కండరాల బలహీనత వంటి సమస్యలు తగ్గుతున్నాయని చెబుతన్నారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసికంగా కూడా చురుకుదనం పెరుగుతోందని అంటున్నారు. అయితే, ఈ విధమైన శారీరక చర్యల్లో కొంత ప్రమాదం కూడా ఉండొచ్చు. ఈ వెల్నెస్‌ పద్దతిలో పాల్గొనే సీనియర్‌ సిటిజన్స్‌ పడిపోవడం, చిన్న చిన్న గాయాలు తగలడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ, ఈ ట్రెండ్ వల్ల తమలో ఒక పాజిటివ్ మార్పు వస్తోందని, జీవితం పట్ల కొత్త ఉత్సాహం కలుగుతోందని వారు చెబుతుండటం విశేషం. మొత్తానికి, ఈ ‘జెరియాట్రిక్ పార్కర్‌’ వృద్ధులకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అందిస్తూ వయస్సు కేవలం సంఖ్య మాత్రమే అని నిరూపిస్తోంది. సరైన మార్గదర్శకంతో ఈ ట్రెండ్‌ను అనుసరిస్తే వృద్ధులు కూడా యవ్వనంతో నిండిన జీవితాన్ని ఆస్వాదించగలరని ఫిట్‌నెస్‌ నిపుణులు అంటున్నారు.

Also Read: Girl Dinner: యూత్‌ని ఆకట్టుకుంటున్న గర్ల్ డిన్నర్ ట్రెండ్.. అంటే ఏంటో తెలుసా?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News