Homeలైఫ్ స్టైల్Gota Patti Hairstyle: గోటా పట్టీ హెయిర్ స్టైల్.. క్షణాల్లో ఫెస్టివ్ లుక్!

Gota Patti Hairstyle: గోటా పట్టీ హెయిర్ స్టైల్.. క్షణాల్లో ఫెస్టివ్ లుక్!

Gota Patti Hair Trend: పండుగలు, ఫంక్షన్లు ఎలాంటి సంప్రదాయా వేడుకైనా ప్రత్యేకంగా కనిపించాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అలాంటి సందర్భాల్లో వెంటనే ఫెస్టివ్ వైబ్ తీసుకురాగల కొత్త హెయిర్ ట్రెండ్ ‘గోటా పట్టీ హెయిర్ స్టైల్’. కేవలం రెండు నిమిషాల్లోనే జుట్టుకు సరికొత్త, స్టైలిష్ లుక్ ఇచ్చే ఈ ట్రెండ్ ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో హాట్‌ ట్రెండ్‌గా మారింది.

- Advertisement -

ప్రస్తుతం గోట పట్టి హెయిర్ స్టైల్స్ సాంప్రదాయక వేడుకలు, వివాహాలకు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఈ గోటా పట్టి హెయిర్‌ స్టైల్స్‌ మగువులను మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి. జడలు, బన్‌ చుట్టూ గోట పట్టి లేస్, పరాందీలను ఉపయోగించి ఈ స్టైల్స్ క్రియేట్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా జిగ్-జాగ్ జడలు, లో బన్‌లు, పూలతో కూడిన డిజైన్లు ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ స్టైల్స్.. లెహంగాలు, చీరలు, పంజాబీ సూట్‌లపై అద్భుతంగా కనిపిస్తాయి.

సింపుల్ ఐడియా.. స్టైలిష్ లుక్
మన చిన్నప్పుడు జుట్టుకు రిబ్బన్లు కట్టుకునే అలవాటు ఉండేది. అదే కాన్సెప్ట్‌ను మోడర్న్ టచ్‌తో తీసుకొచ్చిందే గోటా పట్టీ హెయిర్ స్టైల్. సాధారణ రిబ్బన్లకు బదులుగా మీకు నచ్చిన గోటా పట్టీ వెరైటీలను జుట్టుతో కలిసి అల్లడం ఈ ట్రెండ్ ప్రత్యేకత. చాలా తక్కువ సమయంలో సింపుల్‌ అండ్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌ ఇస్తుంది. అందుకే ఫంక్షన్లు, సాంప్రదాయ వేడుకులకు అమ్మాయిలు ఎక్కువగా ఈ స్టైల్‌ని ఫాలో అవుతున్నారు.

కళ్లు చెదిరే డిజైన్స్
గోటా పట్టీలు ఎన్నో రకాల డిజైన్స్‌లో అందుబాటులో ఉన్నాయి. షైనింగ్‌ బీట్స్‌, షైనింగ్‌ లేస్‌ రంగురంగుల ప్యాటర్న్స్‌తో ఇవి జుట్టుకు ప్రత్యేక ఆకర్షణను తీసుకొస్తున్నాయి. జడ వేసినా, కొప్పు కట్టినా ఈ గోటా పట్టీలు జుట్టును మరింత అందంగా చూపిస్తాయి. ఈ హెయిర్ స్టైల్ ఎథ్నిక్ డ్రెస్సులకే కాదు, ఫ్యూజన్ అవుట్‌ఫిట్స్‌కూ బాగా సెట్ అవుతుంది. ముఖ్యంగా లెహంగాలు, చీరలు వంటి సంప్రదాయ దుస్తులతో కలిపి వేసుకుంటే అద్భుతమైన ఫెస్టివ్ లుక్ ఇస్తుంది. మొత్తానికి, గోటా పట్టీ హెయిర్ స్టైల్ అనేది సింపుల్ అయినా స్టైలిష్‌గా కనిపించే కొత్త ట్రెండ్. తక్కువ సమయంలో ట్రేండిగా రెడీ అవ్వడానికి, పర్ఫెక్ట్‌ ఫెస్టివ్ లుక్ ఇవ్వాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. మరి ఇంకేంటి మీరు కూడా ఈ ట్రెండ్‌ను ట్రై చేసి మీ స్టైల్‌కు కొత్త మెరుపు తీసుకురండి!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News