Homeలైఫ్ స్టైల్Graveyard Dating: గ్రేవ్‌యార్డ్ డేటింగ్: స్మశానంలో ఫస్ట్ డేట్.. కొత్త ట్రెండ్‌పై చర్చ

Graveyard Dating: గ్రేవ్‌యార్డ్ డేటింగ్: స్మశానంలో ఫస్ట్ డేట్.. కొత్త ట్రెండ్‌పై చర్చ

Graveyard Dating: ప్రస్తుతం జెన్ జీ విభిన్న జీవిన శైలిని వెతుక్కుంటోంది. ఏం చేసిన అందులో కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నారు. ముఖ్యంగా డేటింగ్ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తోంది. ప్రస్తుతం వెస్టర్న్ దేశాల్లో అలాంటి ఓ విచిత్రమైన డేటింగ్ ట్రెండ్ బాగా ట్రెండ్ అవుతుంది. అదే “గ్రేవ్‌యార్డ్ డేటింగ్”. సాధారణంగా పార్కులు, కేఫేలు, బీచ్‌లు వంటి ప్రదేశాల్లో జరిగే ఫస్ట్ డేట్స్‌కు బదులుగా కొంతమంది స్మశానాల్లో తమ మొదటి డేట్‌ను జరుపుకోవడం ప్రారంభించారు.

- Advertisement -

ఇది చాలా మందికి షాక్‌గా అనిపించినా ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నవారు మాత్రం దీని వెనుక ప్రత్యేకమైన భావన ఉందని చెబుతున్నారు. స్మశానం అనేది ప్రశాంతమైన నిశ్శబ్దమైన ప్రదేశం కావడం వల్ల ఇక్కడ కలిసినప్పుడు ఇద్దరూ ఒత్తిడి లేకుండా మాట్లాడుకోవచ్చని వారు భావిస్తున్నారు. అంతేకాదు ప్రైవసీ కూడా ఎక్కువగా ఉండటం ఈ ట్రెండ్‌కు ఆకర్షణగా మారింది. సోషల్ మీడియాలో చాలామంది తమ గ్రేవ్‌యార్డ్ డేట్ అనుభవాలను షేర్ చేయడంతో ఇది మరింత వైరల్ అవుతోంది.

కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా ఈ కాన్సెప్ట్‌ను చూపించడం వల్ల యువతలో ఆసక్తి పెరుగుతోంది. అయితే, ఈ ట్రెండ్‌పై విమర్శలు కూడా ఉన్నాయి. సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.ప్రత్యేకంగా భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. విదేశాల్లో స్మశానాలు పరిశుభ్రంగా, సురక్షితంగా ఉండే అవకాశం ఉంది. కానీ మన దేశంలో పరిస్థితులు వేరుగా ఉండటం వల్ల, ఇలాంటి ట్రెండ్స్‌ను అనుసరించే ముందు ఆలోచించడం అవసరం. కొత్తదనం కోసం చేసే ప్రతి ప్రయోగం సరైనదే కాదు. కాబట్టి, ట్రెండ్‌ను అనుసరించే ముందు దాని ప్రయోజనాలు, ప్రమాదాలు రెండింటినీ అర్థం చేసుకోవడం ముఖ్యము.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News