Sunday, November 16, 2025
Homeలైఫ్ స్టైల్Green Tea Face Mask: స్కిన్ గ్లో ని పది రెట్లు పెంచే గ్రీన్...

Green Tea Face Mask: స్కిన్ గ్లో ని పది రెట్లు పెంచే గ్రీన్ టీ మాస్క్‌..

Green Tea Face Mask Benefits: గ్రీన్‌ టీ గురించి ఈ రోజుల్లో తెలియని వాళ్లుండరు. సినీతారల నుంచి సాధారణ ప్రజల వరకు గ్రీన్‌ టీకి చాలా క్రేజ్ ఉంది. సాధారణ టీ కంటే ఇందులో బోలెడు ఆరోగ్యలాభాలు ఉంటాయని వైద్యులు, జిమ్ ట్రైనర్లు కూడా సూచిస్తున్నారు. ఈ గ్రీన్‌ టీని కెమెలీయాసైనన్సిస్ అనే మొక్క ఆకులతో తయారు చేస్తారు. దీని ప్రతిరోజు తీసుకోవడం వల్ల అధిక బరువు తగ్గడంతో పాటు ఏకాగ్రత పెరుగుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటాక్సిడెంట్లు, థెరపిటిక్ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే గ్రీన్‌ టీ శరీరానికి మాత్రమే కాకుండా చర్మానికి కూడా సహాయపడుతుందని చర్మ నిపుణులు చెబుతున్నారు. గ్రీన్‌ టీ ఫేస్ మాస్క్ ను ఉపయోగించడం వల్ల అన్ని రకాల చర్మ సమస్యలకు చెక్‌ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

గ్రీన్‌ టీ ఫేస్ మాస్క్ వల్ల కలిగే లాభాలు:

స్కిన్‌ కేర్‌ రోటీన్ లో గ్రీన్‌ టీ మాస్క్‌ఉపయోగించడం వల్ల బోలెడు లాభాలు పొందవచ్చు. మార్కెట్‌లో లభించే మాస్క్‌ కంటే ఇది చర్మాని కాంతివంతంగా చేస్తుంది. ముఖ్యంగా చర్మంపైన కలిగే దురద, మొటిమలు, నల్ల మచ్చలను తగ్గిస్తుందని చర్మనిపుణులు చెబుతున్నారు. ఈ గ్రీన్ టీ ఫేస్ మాస్క్‌ను చల్లికాలంలో ఉపయోగించడం వల్ల చర్మాని తేమగా ఉంచుతుంది. అంతేకాకుండా ఇది యాక్నేతో బాధపడేవారికి పనిచేస్తుంది. గ్రీన్‌ టీ మాస్క్‌ ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు లేదా మార్కెట్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు.

ALSO READ: https://teluguprabha.net/health-fitness/eating-white-rice-everyday-can-increase-sugar-levels-weight-gain/

గ్రీన్‌ టీ ఫేస్ మాస్క్ ఇంట్లోనే చేసుకోవడం ఎలా?

గ్రీన్‌ టీ ఫేస్ మాస్క్‌ను అనేక రకాలుగా తయారు చేసుకోవచ్చు. అందులో మొదటిది గ్రీన్ టీ పొడిలో టేబుల్ స్పూన్ నిమ్మరసం కలుపుకొని ముఖంపైన రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. దనీ టోనర్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు. లేదా నిమ్మరసం బదులుగా ముల్తానీ మట్టిని కూడా ఉపయోగించుకోవచ్చు.ఇది చర్మాని హైడ్రేటింగ్‌ గా ఉంచడమే కాకుండా మృతకణాలను కూడా తొలగిస్తుంది. దీని ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా ఒక మూడు టేబుల్ స్పూన్‌ గ్రీన్‌ టీ పొడిని తీసుకొని అందులోకి రెండు స్పూన్‌ల ముల్తానీ మట్టిలోకి నీరు లేదా రోజ్‌ వాటర్‌ను కలుపుకొని ముఖాన్నికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

ALSO READ: https://teluguprabha.net/health-fitness/taking-vitamin-b6-supplements-is-good-or-bad/

బియ్యం పిండిని కూడా గ్రీన్‌ టీ పొడిలో కలుపుకోవచ్చు. దీని కోసం మీరు ఒక టేబుల్ స్పూన్‌ గ్రీన్‌ టీ లోకి టేబుల్‌ స్పూన్‌ నిమ్మరసాన్ని బియ్యంపిండిలోకి కలుపుకోవాలి. ఫేస్ మీద ఈ మిశ్రమాని రాసుకొని 10- 15 నిమిషాల తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల స్కిన్‌ ఎక్స్ పొయిలేట్‌ అవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad