Saturday, November 15, 2025
Homeలైఫ్ స్టైల్Hair Care: ఖరీదైన ఉత్పత్తులు వద్దు..ఈ ఆకు నీళ్లతో ఇలా చేస్తే జుట్టు రాలకుండా పెరుగుతుంది..

Hair Care: ఖరీదైన ఉత్పత్తులు వద్దు..ఈ ఆకు నీళ్లతో ఇలా చేస్తే జుట్టు రాలకుండా పెరుగుతుంది..

Hair Care Tips: కొందరికి ఉదయాన్నే ఒక కప్పు టీ తాగనిదే రోజూ గడవదు. ఉదయం టీ తో ప్రారంభిస్తే, రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చని భావిస్తారు. అయితే, టీ తయారులో ఉపయోగించే టీ ఆకులు అందం, జుట్టు సంరక్షణకు రహస్యం కూడా అవుతాయని మీకు తెలుసా? వంటింట్లో సులభంగా లభించే టీ ఆకులు శరీరాన్ని ఉత్తేజపరచడమే కాకుండా జుట్టు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.

- Advertisement -

టీ ఆకులలో యాంటీఆక్సిడెంట్లు, కెఫిన్, టానిన్లు ఉంటాయి. ఇవి జుట్టుకు సహజమైన మెరుపు, బలాన్ని ఇస్తాయి. జుట్టు రాలడం నుండి రక్షిస్తాయి. టీ ఆకులను సరిగ్గా వాడితే చుండ్రు, జుట్టు రాలడం, తలపై ఇన్ఫెక్షన్ల వంటి సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. ఈ క్రమంలో జుట్టు సంరక్షణలో టీ ఆకులను ఎలా ఉపయోగించాలి? దీని ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

హెయిర్ రిన్స్‌గా: టీ ఆకులను మరిగించి చల్లబరిచి వాటితో జుట్టును కడగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది సహజమైన మెరుపును జోడిస్తుంది. జుట్టును మృదువుగా చేస్తుంది. ముఖ్యంగా బ్లాక్ టీ రిన్స్‌లు జుట్టు మెరుపును పెంచడానికి ప్రయోజనకరంగా ఉంటాయి.

చుండ్రు నుండి ఉపశమనం: టీ ఆకుల యాంటీమైక్రోబయల్ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన నెత్తిని ప్రోత్సహిస్తాయి. వారానికి రెండుసార్లు టీ నీటిని వాడటం వల్ల చుండ్రు తగ్గుతుంది. దురద నుండి ఉపశమనం లభిస్తుంది.

also read:Cold, Cough Relief: దగ్గు, జలుబు తగ్గట్లేదా..? ఈ 4 వంటింటి చిట్కాలతో చెక్ పెట్టేయండి..

జుట్టు పెరుగుదల: గ్రీన్, బ్లాక్ టీ రెండూ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. వీటిలో ఉండే కెఫిన్ కంటెంట్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

సహజ జుట్టు రంగు: టీ ఆకులను సహజ జుట్టు రంగుగా కూడా ఉపయోగించవచ్చు. జుట్టుకు టీ ఆకు కషాయాన్ని పూయడం వల్ల వైట్, గ్రే ఉన్న వెంట్రుకలు నల్లగా అవుతాయి. ఇది రసాయన రంగులకు సహజ ప్రత్యామ్నాయం.

ఎలా ఉపయోగించాలి?

జుట్టు సంరక్షణ కోసం 2 కప్పుల నీటిలో 2-3 టీస్పూన్ల టీ ఆకులను మరిగించాలి. ఈ మిశ్రమం చల్లబడిన తర్వాత వడకట్టి జుట్టును శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించాలి. మరిన్ని ప్రయోజనాలను పెంచడానికి ఈ మిశ్రమంలో కొంత నిమ్మరసాన్ని కూడా జోడించవచ్చు.

నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad