Pink Salt Uses: అందంగా కనిపించాలనుకోవడం ప్రతి ఒక్కరిలో ఉండే సహజమైన కోరిక. పురుషుడు అయినా, స్త్రీ అయినా వారు తమ అందం కోసం చేసే ప్రయత్నాలు మాత్రం అన్నింటికంటే ముందుంటాయి. బయట కొత్తగా వచ్చిన క్రీమ్‌లు, స్కిన్ కేర్ టిప్స్, సోషల్ మీడియాలో చూసే హాక్స్ ఇవన్నీ మానవుల్ని ఆకర్షించేవే. కానీ చర్మంపై ఏదైనా మెరుగుదల అనేది లోపల ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే నిజంగా మెరుగ్గా కనిపిస్తుంది అన్న సంగతిని చాలా మంది మర్చిపోతుంటారు. మన శరీరంలోని అంతర్గత అవయవాలు ఆరోగ్యంగా ఉండాలి అంటే సరైన ఆహారం, జీవనశైలి, హైడ్రేషన్ చాలా ముఖ్యం. ఇదే కాకుండా మన ఇంట్లో లభించే కొన్ని సహజ పదార్థాలు కూడా ఆరోగ్యానికి తోడుగా అందాన్ని పెంచడంలో సహాయపడతాయి.
పింక్ సాల్ట్ – అందం కోసం సహజ మార్గం
ఇటీవల పింక్ సాల్ట్ (హిమాలయ ఉప్పు) అనే పదార్థం ఆరోగ్యం, అందం పరంగా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సాధారణ ఉప్పుతో పోల్చితే పింక్ సాల్ట్‌లో సోడియం తక్కువగా ఉండటం వలన ఇది ఆరోగ్యానికి కొద్దిగా మంచిదే అని చెబుతున్నారు నిపుణులు. ఇందులో మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి.
చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచే పింక్ సాల్ట్
పింక్ సాల్ట్‌ను ఆహారంలో పరిమితంగా ఉపయోగించడం వల్ల శరీరంలో డిటాక్సిఫికేషన్ గుణాలు పనిచేస్తాయి. ఇది చర్మాన్ని లోపల నుంచి శుభ్రం చేయడంలో, క్రిములు, మృతకణాలు, ధూళి వంటి తినదగని పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. దీని వలన చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఇలా చర్మం పైన చూసినపుడు ఆరోగ్యంగా, మెరిసేలా కనిపిస్తుంది.
రక్తపోటు నియంత్రణ & హార్మోన్ల సమతుల్యత
పింక్ సాల్ట్‌ను సాధారణంగా వాడే తెల్ల ఉప్పు స్థానంలో వాడితే, రక్తపోటు నియంత్రితంగా ఉండే అవకాశం ఉందని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. ఇది హార్మోన్ల సమతుల్యతను కాపాడడంలో కూడా సహాయపడుతుంది. శరీర చర్మక్రియలను (మెటబాలిజం) మెరుగుపరచి, కొంతమంది ఎదుర్కొనే గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించవచ్చు.
ఇంటి నుంచే సహజంగా అందం
పింక్ సాల్ట్‌ని బాడీ స్క్రబ్‌ల్లోనూ ఉపయోగించవచ్చు. ఇది డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. ఈ విధంగా ఇంట్లో ఉన్న సహజ పదార్థాలతోనే మనం ఆరోగ్యంతో పాటు చర్మాన్ని మెరుగుపరచడం సాధ్యమవుతుంది. అందం కోసం బయట కలకాలం ప్రాడక్టులు వాడకపోయినా, శరీరాన్ని లోపల నుంచి శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడం చాలా ముఖ్యం. పింక్ సాల్ట్ లాంటి సహజ పదార్థాలను జాగ్రత్తగా ఉపయోగించుకుంటే, ఆరోగ్యంతో పాటు చర్మ అందం కూడా రెట్టింపు అవుతుంది.


