Saturday, June 21, 2025
Homeలైఫ్ స్టైల్Benefits of Badam Peels: బాదం పప్పులు తిని, తొక్కలు పడేస్తున్నారా? ఈ విషయలు తెలిస్తే...

Benefits of Badam Peels: బాదం పప్పులు తిని, తొక్కలు పడేస్తున్నారా? ఈ విషయలు తెలిస్తే అసలు పడేయరు!!

Benefits of Badam Peels: మన డైట్ లో బాదం పప్పులు చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో ఉండే క్యాల్షియం, విటమిన్ ఇ, కాపర్, జింక్, ఫాస్ఫరస్, ఐరన్ వంటి పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, కేవలం బాదం పప్పులు మాత్రమే కాకుండా వాటి తొక్కలు కూడా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. సాధారణంగా మనం బాదం పప్పులను నానబెట్టుకుని తింటుంటాం. చాలామంది నానబెట్టిన బాదంపప్పులను తినేటప్పుడు వాటి తొక్కలను విసిరేయడం చేస్తుంటారు. అయితే, బాదం పప్పులు తొక్కలు తీసుకోవడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే.. బాదం తొక్కలు కూడా పోషకాలు నిధి. ఇప్పుడు బాదం తొక్కలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం.

- Advertisement -



జీర్ణక్రియ ఆరోగ్యం

బాదం తొక్కలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మన జీర్ణవ్యవస్థకు ఎంతో ముఖ్యమైనది. ఫైబర్ మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. అంతేకాకుండా కడుపును శుభ్రంగా ఉంచుతుంది. దీని వినియోగం ఆహారం తక్కువ తీసుకునే విధంగా చేస్తుంది. దీంతో బరువు తగ్గాలనుకునేవారు సులభంగా బరువు తగ్గొచ్చు.


యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్

బాదం తొక్కలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్, గుండె జబ్బులు వంటి అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. ఇటువంటి పరిస్థితిలో బాదం తొక్కలు ఈ వ్యాధులతో పోరాడే శక్తిని మనకు ఇస్తాయి.


చర్మం, జుట్టుకు ప్రయోజనకరం

బాదం తొక్కలు చర్మం, జుట్టుకు కూడా చాలా మంచివి. వాటిలో ఉండే పోషకాలు చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. అంతేకాకుండా జుట్టును బలోపేతం చేయడానికి సహాయపడతాయి. అయితే, వీటిని స్క్రబ్‌లు లేదా మాస్క్‌లు తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు.


రోగనిరోధక శక్తి

బాదం తొక్కలు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు శరీరాన్ని వ్యాధులతో పోరాడటానికి సహాయం చేస్తాయి. బలమైన రోగనిరోధక శక్తి అంటే అనారోగ్యానికి గురికాకుండా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం. ఈ తొక్కలు బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది


బాదం పప్పులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల వాటి తొక్కలు ఎక్కువ కాలం కడుపు నిండి ఉండేలా చేస్తాయి. ఇవి పదే పదే ఆకలిగా అనిపించకుండా చేస్తాయి. దీంతో మనం తక్కువ ఆహారం తీసుకుంటాం. అందువల్ల బరువు తగ్గాలని చూసేవారు తమ ఆహారంలో ఆహారంలో బాదం తీసుకొని వాటి తొక్కలను తొలగించకుండా తినాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News