Saturday, November 15, 2025
Homeలైఫ్ స్టైల్Cinnamon Water: బరువు తగ్గడం నుంచి షుగర్ కంట్రోల్ వరకు..దాల్చిన చెక్క నీరు తాగడం వల్ల...

Cinnamon Water: బరువు తగ్గడం నుంచి షుగర్ కంట్రోల్ వరకు..దాల్చిన చెక్క నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

Cinnamon Water Benefits: మనలో చాలామంది దాల్చిన చెక్క నీటిని తాగడానికి ఇష్టపడరు. కానీ, ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దాల్చిన చెక్కలో ఎన్నో ఔషధ గుణాలు, పోషకాలు అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. ఇది వంటకాల రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి అనేక వప్రయోజనాలను అందిస్తాయి. ఈ మసాలాలో ఉండే కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్లు  జీర్ణక్రియ మెరుగుపరుస్తాయి. బరువు తగ్గడంతో సైతం సహాయపడుతాయి. రోగనిరోధక శక్తి బలంగా చేస్తుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. దాల్చిన చెక్కను వేడినేటిలో మరిగించి లేదా దీని పొడిని వేడి నీటిలో కలుపుకుని టీ లాగా తాగితే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు నీటిలో చిటికెడు దాల్చిన చెక్కను కలిపి తాగడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటి? ఇది బరువు తగ్గడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి ఎలా సహాయపడుతుందో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
బరువు తగ్గడానికి దాల్చిన చెక్క నీరు ఎలా సహాయపడుతుంది?
జీవక్రియను పెంచుతుంది: దాల్చిన చెక్క శరీర జీవక్రియను వేగవంతం చేస్తుంది. జీవక్రియ వేగంగా ఉన్నప్పుడు, శరీరం ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
ఆకలిని నియంత్రిస్తుంది: ఈ గరం మసాలా ఆకలి, అధికంగా తినాలనే ఆశను నియంత్రిస్తుంది. దీన్ని క్రమం తప్పకుండ తాగడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది.  దీంతో పదే పదే తినే అలవాటును నివారించవచ్చు.
ఫ్యాట్ బర్న్: దాల్చిన చెక్క శరీరంలో కొవ్వు పేరుకుపోయే ప్రక్రియను నెమ్మదిస్తుంది. ఇప్పటికే పేరుకుపోయిన కొవ్వును, ముఖ్యంగా బొడ్డు కొవ్వును కరిగించడంలో సహాయపడుతుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.
దాల్చిన చెక్క నీరు రక్తంలో చక్కెర స్థాయిలను ఎలా తగ్గిస్తుంది?
ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది: దాల్చిన చెక్క శరీర కణాలను ఇన్సులిన్‌కు మరింత సున్నితంగా చేస్తుంది. ఇన్సులిన్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే హార్మోన్. మెరుగైన సున్నితత్వం చక్కెర నియంత్రణను సులభతరం చేస్తుంది.
రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది: ఈ మసాలా భోజనం తర్వాత రక్తప్రవాహంలోకి గ్లూకోజ్ ప్రవేశించడాన్ని నెమ్మదిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలలో ఆకస్మిక హెచ్చుతగ్గులను నివారిస్తుంది.
యాంటీఆక్సిడెంట్ల నిల్వ: దాల్చిన చెక్కలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా  ఉంటాయి. ఇది డయాబెటిస్ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
దాల్చిన చెక్క నీరు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు
జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది: ఇది సరైన జీర్ణక్రియను నిర్వహిస్తుంది. గ్యాస్, ఆమ్లత్వం, మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందడంలో ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
 గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది: దాల్చిన చెక్క చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది: ఇది యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. జలుబు, ఫ్లూ వంటి కాలానుగుణ ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది.
దాల్చిన చెక్క నీటిని ఎలా తయారు చేయాలి?
దీన్ని తయారు చేయడం చాలా సులభం. ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తీసుకోవాలి. దానికి సగం లేదా ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని వేసి బాగా మిక్స్ చేసి తాగాలి. ఇలా కాదనుకుంటే ఒక అంగుళం దాల్చిన చెక్కను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం ఆ నీటిని కాస్త వేడి చేసి తాగవచ్చు. కావాలంటే రుచి కోసం దాల్చిన చెక్క నేతిలో కాస్త నిమ్మరసం లేదా చిటికెడు తేనెను కూడా జోడించవచ్చు( డయాబెటిస్ లేకపోతే).
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad