Monday, March 31, 2025
Homeలైఫ్ స్టైల్Health: టీ-కాఫీ తాగేముందు నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా..?

Health: టీ-కాఫీ తాగేముందు నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా..?

టీ – కాఫీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధమైన పానీయాలు. ఇవి ఉదయాన్నే శరీరానికి ఉల్లాసాన్ని అందిస్తూ బాధ్యతల కోసం మానసిక ఉత్సాహాన్ని కలిగిస్తాయి. టీ లో యాంటీఆక్సిడెంట్లు ఉండగా, కాఫీలో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తాగడం అలవాటుగా మారి.. రోజువారీ జీవనశైలిలో భాగమైంది. కాఫీకి మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజుల్లో చాలామందికి కాఫీ లేదా టీ తాగడం ఒక అలవాటుగా మారింది. అయితే టీ, కాఫీ తాగేముందు మంచి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

చాలామందికి టీ తాగే ముందు నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. ఇది ఆరోగ్యకరమని భావిస్తారు. టీ – కాఫీ తాగేముందు నీళ్లు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం. టీ, కాఫీలోని కెఫీన్ అధిక స్థాయిలో ఉంటుంది. ముందు నీళ్లు తాగడం ద్వారా ఈ కెఫీన్ యొక్క దుష్ప్రభావాలను తగ్గించవచ్చు. పరగడుపున టీ, కాఫీ తాగితే ఎసిడిటీ సమస్య తలెత్తుతుంది, కానీ ముందుగా నీరు తాగడం వల్ల ఇది నివారించవచ్చు.

మరోవైపు టీ – కాఫీలోని ట్యానిన్ మూలంగా పళ్లు పసుపు రంగుకు మారే ప్రమాదం ఉంటుంది. ముందుగా నీరు తాగడం వల్ల ఈ సమస్యను నివారించవచ్చు. అలాగే టీ-కాఫీ వల్ల gastritis, అల్సర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది, కానీ ముందుగా నీళ్లు తాగడం వీటిని నివారించడంలో సహాయపడుతుంది. టీ, కాఫీ శరీరంలో నీటిశాతం తగ్గిస్తుంది, ముందుగా నీరు తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య తగ్గుతుంది. టీ, కాఫీ మలం సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంది, ముందుగా నీరు తాగడం వల్ల ఇది కూడా తగ్గుతుంది.

మొత్తం మీద టీ, కాఫీ తాగేముందు నీళ్లు తాగడం మెటాబాలిజాన్ని వేగవంతం చేస్తుంది. ఇది శరీరానికి అవసరమైన న్యూట్రియంట్లను సమృద్ధిగా అందిస్తుంది. అంతేకాదు, నీరు తాగడం మెదడుకు శక్తినిచ్చి, మానసిక ఉల్లాసాన్ని కలిగించడంలో సహాయపడుతుంది. టీ లేదా కాఫీ తాగే ముందు నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదే, కానీ మితంగా తాగడం అవసరం. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించడం లేదు.)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News