Wednesday, February 11, 2026
Homeలైఫ్ స్టైల్Water: నిద్రలేవగానే నీరు తాగుతున్నారా..? అయితే బాడీలో జరిగేది ఇదే..!

Water: నిద్రలేవగానే నీరు తాగుతున్నారా..? అయితే బాడీలో జరిగేది ఇదే..!

Drinking Water: మన శరీరానికి నీరు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శరీరం సక్రమంగా పనిచేయాలంటే ప్రతిరోజు సరిపడ నీరు తాగాలి. ముఖ్యంగా, ఉదయం పూట ఖాళీ కడుపుతో నీరు త్రాగడం అనేక ఆరోగ్య లాభాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే నిద్రపోతున్నప్పుడు చెమట, శ్వాస మొదలైన కారణాలతో శరీరంలోని నీరు తగ్గిపోతుంది. ముఖ్యంగా, సరిపడా నిద్రపోకుండా మేల్కొన్నప్పుడు మెదడు పనితీరు కాస్త నెమ్మదిస్తుంది. అంతేకాదు, శరీరం యాక్టివ్ గా ఉండదు. దేనిపై దృష్టి సారించలేం. ఏకాగ్రత దెబ్బతింటుంది. చాలా త్వరగా అలసిపోతాము. అలాంటప్పుడు నీరు త్రాగితే డీహైడ్రేషన్ తగ్గడమే కాకుండా శరీరాన్ని చురుకుగా ఉంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఉదయాన్నే నీరు త్రాగడం వల్ల డే మొత్తం ఉత్సాహంగా ఉండవచ్చు.

- Advertisement -

also read:Haier: మార్కెట్లోకి నాలుగు కొత్త హైయర్ 4K అల్ట్రా స్మార్ట్ టీవీలు.. ధరలు కేవలం రూ.25,990 నుండి ప్రారంభం..!

ఖాళీ కడుపున నీరు త్రాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. దీనినే థెర్మోజెనిసిస్ అంటారు. దీనివల్ల శరీరంలో ఎక్కువ కేలరీలో బర్న్ అవుతాయి. అలాగే ఉదయానే నీరు త్రాగడం వల్ల డైజేషన్ ఇంప్రూవ్ అవుతుంది. రోజు సరిపడా నీరు త్రాగడం వల్ల కిడ్నీలో పనితీరు కూడా మెరుగ్గా ఉంటుంది. సరిపడ నీరు త్రాగకపోతే తలనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఉదయాన్నే నీరు త్రాగడం వల్ల రోజంతా శక్తివంతంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది.

రోజు ఉదయం 250-500ml నీరును తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగని కెఫిన్, షుగర్ ఉన్న డ్రింక్స్ తాగకూడదు. అలా తాగడం వల్ల దాహం మరింత ఎక్కువ అవుతుంది. ఉదయానే లేవగానే నీరు త్రాగే అలవాటు దాదాపు అందరికీ మంచిదే అయిన కిడ్నీ, హార్ట్, కడుపు, ఎడీమా, సమస్యలు ఉన్నవారు వైద్యులను సంప్రదించిన తర్వాత ఈ చిట్కా పాటించడం మంచిది. ఎందుకంటే ఈ సమస్యలు ఉన్నవారు నీరు ఎక్కువ తాగిన, ఆ అవయవాల పనితీరుపై ఒత్తిడి పడవచ్చు. అందుకే, వైద్యుల సూచనతో ఎంత నీరు త్రాగాలో తెలుసుకుని ఫాలో అవ్వడం మంచిది.

నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News